Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Jul 19 , 2024 | 11:06 AM

Telugu Latest News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మినిట్ టు మినిట్ తాజా వార్తలను ఇక సులభంగా తెలుసుకోవచ్చు. మీకోసమేు ప్రత్యేకంగా లైవ్ అప్‌డేట్స్ ప్లాట్‌ఫామ్.. సమస్త సమాచారం ఇక్కడే చూసేయండి.

Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-07-19T16:54:50+05:30

    మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్.. ప్రయాణికుల ఇక్కట్లు..

    • విజయవాడ: మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల గన్నవరం ఎయిర్‌పోర్టులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాసింజర్లు.

    • సడన్‌గా ఫ్లైట్స్ క్యాన్సిల్ అంటే ఇప్పుడు మేము ఏం చేయాలి అంటున్న పాసింజర్లు.

    • గన్నవరం ఎయిర్‌పోర్టులో సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పాసింజర్లు.

    • తమ పిల్లలకి తెల్లారితే పరీక్షలని గోవాకి వెళ్లాలని ఇక్కడి నుంచి బెంగళూరుకు ఒక ఫ్లైట్ బెంగళూరు నుంచి మరొక ఫ్లైట్ మారాలని అంటున్నారు.

    • అయితే బెంగళూరులో ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అని చెప్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పాసింజర్లు.

    • మైక్రోసాఫ్ట్ ప్రాబ్లమ్ త్వరగా సాల్వ్ చేయాలని అభ్యర్థించిన పాసింజర్లు.

    • తమ పిల్లల పరీక్షు ఆగిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటున్న పాసింజర్స్.

  • 2024-07-19T16:36:38+05:30

    జులై 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

    • అమరావతి: సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.

    • ఐదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం.

    • సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలి, ఎజెండాను ఏంటి అనేదానిపై గవర్నర్ ప్రసంగం తరువాత బీఏసీలో నిర్ణయం.

    • మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.

    • ఈసారి అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం.

    • అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో ఉన్నతాధికారులతో సమావేశం.

    • అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ.

    • అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులతో చర్చ.

    • ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్, మండలి చైర్మన్ సమావేశం.

  • 2024-07-19T15:12:56+05:30

    ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసిన హీరో సుమన్

    Suman.jpg

    • అమరావతి: మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ను మర్యదపూర్వకంగా కలిసిన హీరో సుమన్.

    • ఎన్నికల ఫలితాల తరువాత అందరూ బిజిగా ఉన్నారని ఇప్పటి వరకూ ఎవ్వరిని కలువలేదన్నారు సుమన్.

    • శుక్రవారం ప్రోగ్రాం ఉంది. అందుకే ఒక రోజు ముందు వచ్చి అందర్ని కర్టసీగా కలుస్తున్నాను.

    • ఏపీలో అవకాశం కల్పించడం, స్టూడియోలు కట్టడం మాత్రమే కాదు.

    • ఈ రోజుల్లో చిన్న సినిమాలు ఆడాలంటే లోకేషన్లు బాగా ఉండాలి.

    • పెద్ద సినిమాలు 20శాతం మాత్రమే ఏపీలో తీసి మిగిలినవి విదేశీ లోకేషన్‌లలో తీస్తున్నారు.

    • తమిళ, మళయాళ సినిమాలు రాసే కథల్లో స్వేచ్చ ఉంటుంది.

    • వారు ఎక్కడికైనా వెళ్లి సినిమాలు తీస్తారు.

    • హైదరాబాద్‌కు ఇండస్ట్రీ రావాలని ఇక్కడే సినిమాలు తీయాలని, 20 శాతం బయట తీయాలని అప్పట్లో రూల్ పెట్టారు.

    • ఇక్కడి లోకేషన్‌లు అన్ని ఇప్పటికే తీసేసాం.

    • ప్రేక్షకులు కొత్తలోకేషన్లు ఉంటే తప్ప సినిమాలను ఆదరించడం లేదు.

    • పెద్ద సీనిమాలకు సెట్స్ వేయడానికి డబ్బు ఉంది. చిన్న సినిమాలకు అది సాధ్యం కాదు.

    • తెలుగు సినిమాలు సక్సెస్ అయితే అవికూడా డబ్బింగ్ అవుతాయి.

    • గతంలో చెన్నైలోనే అన్ని సినిమాలు తీసేవాళ్లం.

    • లోకేషన్‌ల విషయంలో కండిషన్లు వద్దు, చిన్న సినిమాలకు మరింత ఫ్రీడం ఇవ్వాలి.

    • ఫిలిం సిటీలా ఏపీలో చిన్నచిన్న సెట్‌లు కట్టాలి. అవి రన్నింగ్ అవ్వడానికి కన్వెన్షన్ సెంటర్ అనుబందంగా పెడితే ఆదాయానికి కొదవ ఉండదు.

    • ఏపీలో ఉన్న ప్రోడ్యూస‌ర్‌లు అందరూ ఇక్కడే తీద్దామనుకుంటున్నారు.

    • హైదరాబాద్‌లో కాస్ట్ ఎక్కవ అనే అభిప్రాయం వారికి ఉంది.

    • ఒక మీటింగ్ పెట్టుకొని డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌లు చర్చించి సీఎం దగ్గరకు వెళ్లి మాట్లాడాలి.

    • ఓటిటి జమానాలో సినిమాలు తీయాలంటే కథ బావుండాలి లోకేషన్లలో కొత్తదనం ఉండాలి

    • గతంలో ఇక్కడే కాదు కశ్మీర్‌లో సైతం సాంగ్స్ షూటింగ్ చేశాం.

  • 2024-07-19T14:39:13+05:30

    Telangana : గ్రూప్ 2 పరీక్ష వాయిదా

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. ఈ పరీక్ష ఆగష్టు 7, 8 తేదీల్లో ఉండగా.. ఇప్పుడు దానిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్‌లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

  • 2024-07-19T13:48:36+05:30

    ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం

    microsoft.jpg

    • మైక్రోసాఫ్ట్ 365 యాప్స్ సేవల్లో సాంకేతిక సమస్యలు.

    • బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలీకాం, మీడియా సహా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం.

    • లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో నిలిచిపోయిన సేవలు.

    • అమెరికాలో ఎమర్జెన్సీ సేవల నెంబర్ 911పై ప్రభావం.

    • భారత్‌లో విమాన, ఐటీ సేవలకు అంతరాయం.

    • ప్రసారాలు జరుగుతుండగా మధ్యలో నిలిచిపోయిన స్కై న్యూస్.

    • అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.

    • ప్రయాణికులకు సూచనలు జారీ చేసిన ఢిల్లీ విమానాశ్రయం.

    • ఇండిగో, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ తదితర విమాన సంస్థల సేవలకు విఘాతం.

    • అమెరికా విమానాశ్రయాల్లో మాన్యువల్ తనిఖీలు.

    • అత్యధికంగా ప్రభావితమైన ఆస్ట్రేలియాలో వివిధ రంగాలు.

    • వార్తలు ప్రసారం చేయలేకపోతున్న ఆస్ట్రేలియా న్యూస్ ఛానెళ్లు.

  • 2024-07-19T12:56:08+05:30

    తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు..

    • విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు.

    • వర్షాల కారణంగా జలమయమైన రోడ్లు.

    • లోతట్టు ప్రాంతాల్లోకి చేరుకున్న నీరు.

    • లంక గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అధికారులు.

    • భారీ వర్షాలపై సీఎం సమీక్ష ఏర్పాటు చేయడంతో అలర్ట్ అయిన అధికారులు.

    • భారీ వర్షాల కారణంగా మ్యాన్ హోల్స్ నిడిపోవడంతో రోడ్ల మీదకు చేరుకున్న నీరు.

    • వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నగరవాసులు.

  • 2024-07-19T12:50:48+05:30

    పిల్లలను బెదిరించబోయి తండ్రి మృతి..

    • విశాఖ గోపాలపట్నం కొత్తపాలెంలో విషాదం చోటు చేసుకుంది.

    • పిల్లలు అల్లరి చేస్తున్నారని బెదిరించే ప్రయత్నంలో తండ్రి మృతి.

    • అల్లరి చేస్తే చచ్చిపోతా అంటూ పిల్లల అల్లరిని మానిపించడానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం విషాదాన్ని మిగిల్చింది.

    • రైల్వేలో లోకో పైలట్‌గా పనిచేస్తున్న చందన కుమార్.

    • పిల్లలు డబ్బులు చించివేయడంతో వారిని మందలించగా అడ్డుపడిన భార్య.

    • భార్య, పిల్లల ముందే ఫ్యాన్‌కు చీరకట్టి ఆత్మహత్య చేసుకుంటానని భయపెట్టే ప్రయత్నం చేసిన చందన కుమార్.

    • చీర బిగుసుకొని ప్రాణాలు పోగొట్టుకున్న చందన కుమార్.

    • పిల్లలను బెదిరించడానికి ఆత్మహత్య చేసుకున్నట్లు నటిస్తున్నారని మొదట భావించిన భార్య.

    • నిజం తెలుసుకొని.. కన్నీరు మున్నీరుగా విలపించిన భార్య.

    • విషయం తెలుసుకున్న గోపాలపట్నం పోలీసులు.

    • సంఘటన స్థలానికి చేరుకుని కేసుని దర్యాప్తు చేస్తున్న గోపాలపట్నం పోలీసులు.

  • 2024-07-19T12:40:11+05:30

    రైతులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పు అస్సలు చేయకండి..

    Telangana-Farmers.jpg

    Telangana Crop Loan Waiver: తెలంగాణ వ్యాప్తంగా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. తమ రుణాలు మాఫీ అయ్యాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆనంద క్షణాల్లోనే రైతులను టార్గెట్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అమాయక రైతులను నిలువునా ముంచేందుకు సిద్ధమయ్యారు కేటుగాళ్లు. అందుకే అలర్ట్‌గా ఉండాలంటూ తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర పోలీసులు కీలక సూచనలు చేశారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 2024-07-19T11:13:34+05:30

    హీరో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా చాట్స్ లీక్..!

    Raj-Tarun-and-Malvi.jpg

    • హీరో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా చాట్స్ లీక్.

    • 2023లో మల్వి మల్హోత్రాకు లవ్ ప్రోపోస్ చేసిన రాజ్ తరుణ్.

    • రాజ్ తరుణ్ నుండి ప్రోపోస్ వచ్చిన వెంటనే ఆక్సెప్ట్ అంటూ మెసేజ్ పెట్టిన మాల్వి

    • అనేక సార్లు రాజ్ తరుణ్‌కు హోటల్స్ బుక్ చేసిన మాల్వి.

    • ప్రతిసారి కోయంబత్తూర్ మాధవ హోటల్‌లో కలిసిన రాజ్ తరుణ్, మాల్వి.

    • వీడియోస్ కాల్స్ ద్వారా రెగ్యులర్ విషయాలు మాట్లాడుకున్న ఇద్దరు.

    • రోజూ ప్లానింగ్స్, ట్రిప్స్, ఔట్స్ ప్రతిదీ షేర్ చేసుకున్న ఇద్దరు.

    • మాల్వ్ పర్సనల్ విషయాలపై రాజ్ తరుణ్ కామెంట్స్.

    • నిజమవుతున లావణ్య ఆరోపణలు.

    • మాల్వి రాజ్ తరుణ్‌తో ఇల్లీగల్ రిలేషన్ అంటూ నార్సింగి పోలీసులకు పిర్యాదు.

    • ముగ్గురిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

  • 2024-07-19T11:04:48+05:30

    ఏపీకి బిగ్ అలర్ట్.. భారీ వర్ష సూచన..

    vangalapudi-anitha.jpg

    • అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.

    • సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వాహణ శాఖ మంత్రి అనిత.

    • అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన మంత్రి.

    • ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి అనిత.

    • ఆయా జిల్లాలో వర్షాలపై తీసుకుటుంటున్న చర్యలపై ఆరా.

    • లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

    • ప్రతి జిల్లాలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశాం.