-
-
Home » Mukhyaamshalu » Breaking News November 15th Monday Latest Telugu News Live Updates Siva
-
Breaking News: నేటి తాజావార్తలు..
ABN , First Publish Date - Nov 15 , 2024 | 08:51 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-11-15T18:37:52+05:30
నిర్మలా సీతారామన్‌తో ముగిసిన చంద్రబాబు సమావేశం
ఢిల్లీ: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
రాష్ట్రానికి ఆర్ధిక సహకారం, అమరావతి, పోలవరం నిర్మాణానికి నిధుల అంశాలపై చర్చ
భేటీకి హాజరైన టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, టీ కృష్ణ ప్రసాద్
-
2024-11-15T18:34:06+05:30
శ్రీశైలం ఆలయ ఈవోగా చంద్రశేఖర్
నంద్యాల: శ్రీశైలం ఈఓగా చంద్రశేఖర్ ఆజాద్‌కు అదనపు బాధ్యతలు
ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయశాఖ
శ్రీశైలం దేవస్థానం ఇంచార్జీ ఈవో చంద్రశేఖర్ రెడ్డిని రిలీవ్ చేసిన దేవాదాయశాఖ
తిరుపతి ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్‌కు శ్రీశైలం దేవస్థానం ఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు
ఈ నెల 7వ తేదీన చంద్రశేఖర్ ఆజాద్ శ్రీశైలం ఆలయ స్పెషల్ ఆఫీసర్‌గా నియామకం
-
2024-11-15T14:20:22+05:30
హైదరాబాద్‌లో బయటపడ్డ భారీ స్కామ్.. ఏకంగా 3,600 మంది..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ మోసం..
బై బ్యాక్ పాలసీ స్కీమ్, డబుల్ గోల్డ్ స్కీమ్ పేరుతో భారీ మోసం.
3600 మందిని మోసగించి 300 కోట్లు కొట్టేసిన కేటుగాడు.
పవన్ కుమార్ అనే నిందితుడిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు.
పవన్ కుమార్ కు సహకరించిన మరో ఏడుగురు అరెస్ట్.
అమాయకుల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు మోసగించిన పవన్ కుమార్.
వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెట్టుబడిదారులను మోసం చేసిన నిందితుడు.
25 నెలలకు గాను బై బ్యాక్ ఓపెన్ ప్లాట్స్ స్కీమ్‌ని ప్రారంభించిన పవన్.
కస్టమర్ల చేత ఎనిమిది లక్షలకు రెండు గంటల భూమి కొనుగోలు చేయించిన నిందితులు.
ప్రతినెలా నాలుగు శాతం లాభం ఇస్తామంటూ ఒప్పందం.
కొన్ని నెలలు లాభాలు ఇచ్చి ఆపై మొహం చాటేసిన పవన్ కుమార్.
మరోవైపు డబల్ గోల్డ్ స్కీం, గోల్డ్ చిట్స్ స్కీం కింద లక్షలు వసూలు.
పెట్టుబడులు తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించి ఈవోడబ్ల్యూ పోలీసులకు బాధితుల ఫిర్యాదు.
-
2024-11-15T13:02:07+05:30
మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ ప్రచారం..
అమరావతి: ఈ నెల 16, 17, తేదీల్లో మహారాష్ట్ర లో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం
మొదటి రోజు మరత్వాడ ప్రాంతంలో పవన్ ఎన్నికల ప్రచారం
రెండవ రోజు 17 వ తేదిన విదర్భ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం
మొత్తం 5 సభలు, రెండు రోడ్డు షోల్లో పాల్గొననున్న పవన్ కళ్యాన్
-
2024-11-15T12:15:26+05:30
సంగారెడ్డి సెంట్రల్ జైలుకు చేరుకున్న కేటీఆర్
సంగారెడ్డి: కందిలోని సంగారెడ్డి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
లగచర్ల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న 16 మంది రైతులతో ములాఖత్ కానున్న కేటీఆర్.
లగచర్ల ఘనటలో ఇప్పటికే 47 మందిపై కేసు నమోదు.
-
2024-11-15T11:59:43+05:30
బాబోయ్.. గాడిదల పేరిట భారీ స్కామ్..
తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ పేరిట భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే కోట్లు సంపాదించవచ్చని నమ్మించి మోసం.
ఒక్కొక్క రైతు నుంచి రూ. 60 లక్షల నుండి రూ. 90 లక్షల వరకు పెట్టుబడులు వసూలు చేశారు.
తమిళనాడులో జులై 23, 2022 దిడొంకి ప్యాలస్ ప్రారంభించారు.
ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణకు చెందిన 400మంది బాధితులు ఉన్నారు.
యూట్యూబ్‌లో అధిక ఇన్‌కమ్ అంటూ ప్రచారం చేస్తూ మొదట లాభాలు, ఆ తర్వాత మోసం.
-
2024-11-15T11:39:55+05:30
పిచ్చోళ్లవుతున్న బీఆర్ఎస్ నాయకులు..
గాంధీభవన్: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు పిచ్చోళ్ళ లాగా వ్యవహరిస్తున్నారు: మల్ రెడ్డి రాంరెడ్డి, రోడ్ల అభివృద్ధి సంస్థ కార్పోరేషన్ ఛైర్మన్
అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు పిచ్చోళ్ళ లాగా వ్యవహరిస్తున్నారు.
ప్రతిపక్షంలో ఏనాడూ మేము దాడులకు పాల్పడలేదు.
ప్రజాభిప్రాయం తీసుకోకుండా బీఆర్ఎస్ కుట్రలు చేస్తోంది.
ఇది ముమ్మాటికీ కలెక్టర్‌ను చంపేసే కుట్రే.
దోచుకోవడం కోసమే రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసింది కేసీఆర్ ప్రభుత్వం.
రోజుకో కుట్రతో రాష్ట్ర అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది.
కేటీఆర్, హరీష్ రావులు పిచ్చోళ్ళలా తిరుగుతున్నారు.
గొడవ సద్దుమణగాలనే కలెక్టర్ తనపై దాడి చేయలేదని చెప్పారు.
కుట్రకు కేటీఆర్ సూత్రదారి అని స్వయంగా పట్నం నరెందర్ రెడ్డి చెప్పారు.
-
2024-11-15T11:26:28+05:30
బీఆర్ఎస్ పదేండల్లో రైతులకు ఏం చేసింది?
గాంధీ భవన్: బీఆర్ఎస్ పదేండల్లో రైతులకు ఏం చేసింది? : పటేల్ రమేష్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్
ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అస్థిర పరచాలని కొందరు కుట్ర చేస్తున్నారు.
పట్నం నరేందర్ రెడ్డి అమాయకపు ప్రజలను రెచ్చగొట్టారు.
కేటీఆర్ డైరెక్షన్‌లో పట్నం నరేందర్ రెడ్డి కుట్ర చేసారు.
అవసరమైతే హత్య చేయమని కేటీఆర్ చెప్పాడు.
అధికారులను చంపేందుకు బీఆర్ఎస్ నాయకులు కుట్ర చేసారు.
బీఆర్ఎస్ పాలనలో మేం అడ్డుకోవాలని అనుకుంటే మీరు ప్రాజెక్టుకు కట్టేవారా?.
కేటీఆర్, హరీష్ కలిసి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే కార్యక్రమం పెట్టుకున్నారు.
ప్రతిపక్షం ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉంది.
ప్రభుత్వం ప్రజల ఆదరణ పొందుతున్నందుకు ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి.
ప్రభుత్వం ఫెయిల్ అయిందని నిరూపించడానికి ప్రతిపక్షాలు పడరాని పాట్లు పడుతున్నారు.
-
2024-11-15T10:11:06+05:30
బిగ్ షాక్.. ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్..
హైదరాబాద్ : ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్.
సిటీలో ఫుడ్స్ సేఫ్టీపై ఆందోళన కలిగిస్తున నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే.
కల్తీ ఆహారంతో దెబ్బతిన్న హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్.
సిటీలోని హోటల్స్ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదంటూ సర్వేలో వెల్లడి.
19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించగా కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్‌లో హైదరాబాద్.
గడిచిన రెండు నెలల వ్యవధిలో 84% ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైన రాష్ట్రంగా భాగ్యనగరం.
62% హోటల్స్, గడువుతీరిన పాడైపోయిన కుళ్ళిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు సర్వేలో వెల్లడి.
బిర్యానీ శాంపిల్స్‌లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు గుర్తింపు.
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ బిర్యానీ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న హోటల్స్ నిర్వాహకులు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేతో జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ విభాగం అలర్ట్.
హోటల్స్ రెస్టారెంట్లలో మార్పు వచ్చేవరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం.
మరో నెల రోజుల వరకు సిటీలో కొనసాగునున్న ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.
-
2024-11-15T09:54:14+05:30
సీఎం చంద్రబాబుకు ముద్రగడ సంచలన లేఖ..
మళ్లీ లేఖలు మొదలుపెట్టిన వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.
సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ లేఖ విడుదల చేసిన ముద్రగడ.
సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకే సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులు అంటూ లేఖలో ఆరోపణలు.
సూపర్ సిక్స్ హామీల అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్.
అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ సూక్తులు.
-
2024-11-15T09:44:35+05:30
పార్కింగ్ ఫీజు పేరుతో ప్రైవేట్ వ్యక్తుల నిలువుదోపిడీ..
బాపట్ల: సూర్యలంక సముద్ర తీరానికి పోటెత్తిన భక్తులు.
పార్కింగ్ ఫీజు పేరుతో భక్తుల నుంచి దోపిడి.
సముద్రానికి వచ్చే వహానానికి అనధికార నగదు వసూలు.
బీచ్‌కు 2 కిలోమీటర్ల దూరంలోనే రోడ్డుకు అడ్డుగా తాడులు కట్టి ఫీజు వసూలు.
ఇబ్బందులు పడుతున్న భక్తులు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాదిగా తరలి వచ్చిన భక్తులు.
ప్రైవేట్ వ్యక్తులు నగదు వసూలు చేస్తున్న పట్టించుకోని పోలీసులు.
-
2024-11-15T09:20:44+05:30
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు..
నంద్యాల : కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం ఆలయానికి పెరిగిన భక్తుల రద్ది.
స్వామివారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం భక్తుల రద్ది కారణంగా స్వామివారి గర్భాలయ అభిషేకాలు స్వామివారి స్పర్శ దర్శనాలు రద్దు.
పాతాళగంగలో కార్తీక స్నానాలను ఆచరిస్తున్న భక్తజనం గంగమ్మ వడిలో కార్తీక దీపాలను వదిలి మొక్కలు తీర్చుకుంటున్న భక్తులు.
గంగాధర మండపం,ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కలు తీర్చుకుంటున్న భక్తులు.
శివనమస్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం క్షేత్రం.
కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం ప్రత్యేక పూజలు.
-
2024-11-15T09:16:32+05:30
ఆ కేసులో మరో పదిమంది అరెస్ట్..
వికారాబాద్: లగచర్ల దాడి ఘటనలో మరో పది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్న పోలీసులు.
నాలుగు బృందాలుగా ఏర్పడి మరికొంత మంది కోసం ముమ్మర గాలింపు చేస్తున్న పోలీసులు.
అదుపులో ఉన్న వారిని సాయంత్రం లోపు రిమాండ్ చేసే అవకాశం.
-
2024-11-15T09:14:52+05:30
భక్తులతో కీటకలాడుతున్న ఆలయాలు
జోగులాంబ గద్వాల జిల్లా: కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కీటకలాడుతున్న ఆలయాలు
నదీ పరవాహక పుణ్యక్షేత్రాలు అయినా
అలంపూర్ లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం
బీచుపల్లి లోని ఆంజనేయ స్వామి ఆలయాలకు
తెల్లవారుజాము నుండి భక్తుల తాకిడి
కార్తీక మాసం సందర్భంగా కృష్ణ , తుంగభద్ర నదులలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు
కార్తీకదీప శోభతో కళకళ లాడుతున్న ఆలయాలు
-
2024-11-15T08:51:16+05:30
నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి: నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
మధ్యాహ్నం 1.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు.
సాయంత్రం 4 గంటల ప్రాంతంలో డిల్లీకి చేరుకోనున్న సీఎం.
ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా.. నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం.
ఈ నెల 29 న రాష్ట్రానికి రానున్న ప్రధాని మోడీ.
విశాఖలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ పార్కులను ప్రారంభించనున్న పీఎం
విశాఖ రైల్వే జోన్, అమరావతి రైల్వే పనుల ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు.
అనంతరం 16, 17 తేదీల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ నుండే వెళ్లనున్న సీఎం చంద్రబాబు.
ఎన్డీయే తరపున మహారాష్ట్రలోని తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ప్రచారం.