Share News

Congress: ఇండియా కూటమిలో విభేదాలు!

ABN , Publish Date - Sep 07 , 2024 | 05:28 AM

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఓ పక్క చర్చలు జరుగుతుండగానే ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు కాంగ్రె్‌సలోకి జంప్‌ చేస్తున్నారు.

Congress: ఇండియా కూటమిలో విభేదాలు!

  • కాంగ్రె్‌సలో చేరిన ఢిల్లీ ఆప్‌ ఎమ్మెల్యే గౌతం

ఢిల్లీ, సెప్టెంబరు 6: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఓ పక్క చర్చలు జరుగుతుండగానే ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు కాంగ్రె్‌సలోకి జంప్‌ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ సీమాపురి నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ క్యాబినెట్‌ మంత్రి, దళిత నేత రాజేంద్ర పాల్‌ గౌతం కాంగ్రె్‌సలో చేరారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కేసీ వేణుగోపాల్‌, దేవేందర్‌ యాదవ్‌, పవన్‌ ఖేరా సమక్షంలో గౌతం హస్తం పార్టీలో చేరారు.


వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో గౌతం చేరికకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆప్‌ నుంచి వలసలు పార్టీకి లాభించే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు దళిత హక్కుల కోసం గట్టిగా పోరాడే నేతగా పేరున్న గౌతం పార్టీని వీడటం పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లేనని ఆమ్‌ ఆద్మీ నేతలంటున్నారు.

Updated Date - Sep 07 , 2024 | 05:28 AM