Share News

Fact Check: కార్టూన్ వివాదం.. గాంధీ ఫ్యామిలీ కాదు, ప్రభుత్వంపైనే కౌంటర్

ABN , Publish Date - Jun 01 , 2024 | 04:23 PM

ఈరోజుల్లో డీప్‌ఫేక్, మార్ఫింగ్ వ్యవహారాలు మరీ ఎక్కువైపోయాయి. లేనివాటిని సృష్టించడం, ఉన్న విషయాలను వక్రీకరించడం కారణంగా.. వివాదాలు నెలకొంటున్నాయి. ఇప్పుడు ఓ కార్టూన్..

Fact Check: కార్టూన్ వివాదం.. గాంధీ ఫ్యామిలీ కాదు, ప్రభుత్వంపైనే కౌంటర్

ఈరోజుల్లో డీప్‌ఫేక్ (Deepfake), మార్ఫింగ్ (Morphing) వ్యవహారాలు మరీ ఎక్కువైపోయాయి. లేనివాటిని సృష్టించడం, ఉన్న విషయాలను వక్రీకరించడం కారణంగా.. వివాదాలు నెలకొంటున్నాయి. ఇప్పుడు ఓ కార్టూన్ (Cartoon) కూడా దేశ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ (Congress Party), గాంధీ ఫ్యామిలీని (Gandhi Family) అప్రతిష్టపాలు చేసేందుకు.. ఓ కార్టూన్‌ని మార్ఫింగ్ చేశారు. గాంధీ కుటుంబం దేశాన్ని దోచుకుంటోందని చూపించడం కోసం.. అసలు కార్టూన్‌ని మార్ఫ్ చేశారు. తీరా చూస్తే.. ఆ కార్టూన్ వెనుక అసలు విషయం అది కాదని వెలుగులోకి వచ్చింది.


ఇంతకీ ఆ కార్టూన్‌లో ఏముందంటే.. ఒక ఆవు ఇండియా మ్యాప్ ఆకారంలో ఉన్న ఆకుని తింటూ ఉంటుంది. దాని పొట్ట మీద కాంగ్రెస్ పార్టీ ‘హస్తం’ గుర్తు ఉంది. పాలన్నీ గాంధీ ఫ్యామిలీ అని రాసి ఉన్న బకెట్‌లోకి వెళ్తే.. దాని మలవిసర్జన భారతీయులు అని రాసి ఉన్న బకెట్‌లోకి వెళ్తుంటుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే.. భారతీయుల్ని కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం గత 70 ఏళ్లుగా దోచుకుంటోందనే అర్థం వచ్చేలా ఆ కార్టూన్‌ని డిజైన్ చేశారు. కానీ.. వాస్తవం అది కాదు. దీనిని అమెరికన్ కార్టూనిస్ట్ బెన్ గారిసన్ డిజైన్ చేశారని, దేశాన్ని కాంగ్రెస్ ఎలా పాలించిందో చూపించడానికి ఇదో ఉత్తమ మార్గమని ఆ కార్టూన్‌పైనే రాసి ఉంది. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Read Also: సల్మాన్ ఖాన్ కేసులో షాకింగ్ నిజాలు.. ఏకంగా పాకిస్తాన్ నుంచి..


Morphing-Cartoong.jpg

మరి ఈ కార్టూన్‌ని నిజంగానే అమెరికన్ కార్టూనిస్ట్ వేశారా? అని ఆరా తీస్తే.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఇది మార్ఫింగ్ చేయబడిన కార్టూన్ అని తేలింది. అదొక ఫేక్ కార్టూన్ అని, అసలు కార్టూన్ ‘మేక్ ఇన్ ఇండియా’పై కౌంటర్‌గా డిజైన్ చేయడం జరిగిందని ఓ యూజర్ షేర్ చేశాడు. బీజేపీని టార్గెట్ చేసుకొని, అమల్ మెహదీ (Amal Mehdi) 2015లో ఈ కార్టూన్ తయారు చేశారని.. ఒరిజినల్ వర్షన్‌ని పంచుకున్నాడు. ఒరిజినల్ వర్షన్‌లో.. మేక్ ఇన్ ఇండియా కేవలం విదేశీ పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరుస్తోందని, భారతీయులకు కాదని అర్థం వచ్చేలా ఉంటుంది. ఇదే విషయాన్ని స్వయంగా కార్టూనిస్ట్ మెహదీ కూడా స్పష్టం చేశారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 04:23 PM