Share News

Chennai: ఆయన నోటి దురుసు వల్లే బీజేపీతో బంధం తెగింది..

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:46 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) నోటి దురుసు వల్లే రెండు పార్టీల మధ్య బంధం తెగిపోయిందని అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి(Former minister SP Velumani) పేర్కొన్నారు.

Chennai: ఆయన నోటి దురుసు వల్లే బీజేపీతో బంధం తెగింది..

- మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి

చెన్నై: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) నోటి దురుసు వల్లే రెండు పార్టీల మధ్య బంధం తెగిపోయిందని అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి(Former minister SP Velumani) పేర్కొన్నారు. కోవైలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ వేలుమణి మాట్లాడుతూ... రెండు కోట్ల మందికి పైగా సభ్యులున్న అన్నాడీఎంకే పార్లమెంటుకు, అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయావకాశాలు కోల్పోయి మళ్లీ బలం పుంజుకుందన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందని తెలిపారు.

ఇదికూడా చదవండి: Premalatha: ఆ నియోజకవర్గంలో రీకౌంటింగ్‌ జరపాలి..


2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓడినా ఓటు బ్యాంక్‌ ఏ మాత్రం చెక్కు చెదరలేదని, ఓటమిపై పార్టీ అధిష్ఠానం సమీక్ష నిర్వహిస్తుందని తెలిపారు. అన్నాడీఎంకే(AIADMK) గురించి అన్నామలై చేసిన విమర్శల వల్లే ఈ ఎన్నికల్లో కూటమి ఏర్పడలేదని, ఒకవేళ రెండు పార్టీలు ఒకే కూటమిలో ఉన్నట్లయితే 30 పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయావకాశాలుండేవన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో మళ్లీ ప్రజలు మెచ్చే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వేలుమణి ధీమా వ్యక్తం చేశారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 12:46 PM