Share News

Rahul Gandhi: కాంగ్రెస్‌ ఎంపీలపై నిఘా.. ర్యాంకులు ఇచ్చేందుకు ప్రత్యే కమిటీ..!

ABN , Publish Date - Aug 08 , 2024 | 08:16 PM

కాంగ్రెస్ పార్టీ 2014లో అధికారం కోల్పోయిన తర్వాత పదేళ్ల పాటు ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్‌గాంధీ ఎంపీలు ఎన్నుకున్నారు.

Rahul Gandhi: కాంగ్రెస్‌ ఎంపీలపై నిఘా.. ర్యాంకులు ఇచ్చేందుకు ప్రత్యే కమిటీ..!
Rahul Gandhi

కాంగ్రెస్ పార్టీ 2014లో అధికారం కోల్పోయిన తర్వాత పదేళ్ల పాటు ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్‌గాంధీ ఎంపీలు ఎన్నుకున్నారు. అయినప్పటికీ తాను ఏకపక్షంగా వ్యవహరించనని, ఎంపీల అందరి అభిప్రాయంతోనే ముందుకు వెళ్తామని రాహుల్ ప్రకటించారు. 2029 ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. పార్టీ బలాన్ని పెంచుకోవడంపై రాహుల్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో పాటు.. ఎంపీల పనితీరుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా పార్లమెంట్‌లో తమ ఎంపీల పనితీరు, చురుకుదనంపై కాంగ్రెస్ పార్టీ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదేశాలతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారట. ఎంపీల పనితీరుపై నిఘా కోసం ఓ కమిటీని ఏర్పాటుచేశారనే చర్చ జరుగుతోంది. తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ.. లోక్‌సభ ఏదైనా అంశంపై ఏకపక్షంగా మాట్లాడనని, సభ్యులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తానని రాహుల్ గతంలోనే ఎంపీల సమావేశంలో పేర్కొన్నారు. ఈకొత్త విధానాన్ని ఇప్పటికే అమలులో పెట్టారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పార్టీకి కేటాయించిన సమయాన్ని రాష్ట్రాలవారీ విభజించి ఎక్కువమంది ఎంపీలు మాట్లాడే అవకాశం కల్పించారు. రాహుల్ ఆదేశాలతో ఏర్పాటైన కమిటీ కాంగ్రెస్ ఎంపీల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఒక్కో ఎంపీ పార్లమెంట్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటున్నారు.. చర్చల్లో ఏ మేరకు భాగస్వామ్యం అవుతున్నారు. సభ్యుడి హాజరుశాతాన్ని ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

Also Read: Viral: గర్ల్ ఫ్రెండ్‌ కోసం.. ఓ టీనేజర్ ఘనకార్యం


ర్యాంకుల కేటాయింపు..

లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీల పనితీరును పర్యవేక్షించే కమిటీ ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీతో పాటు అధిష్టానానికి నివేదిక ఇస్తుంది. ప్రజాప్రయోజనాలకు సంబంధించి ఎన్ని అంశాలను ప్రస్తావించారు. ఎన్ని నోటీసులు ఇచ్చారు. క్వశ్యన్ అవర్‌లో ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. జీరో అవర్‌లో ఎలాంటి అంశాలు, సమస్యలు లేవనెత్తుతున్నారనేదాని ఆధారంగా నివేదిక తయారుచేస్తారు. సభలో మాట్లాడేందుకు పార్టీ సమయం ఇచ్చినప్పుడు ఎలాంటి సంసిద్ధతతో వెళ్లి మాట్లాడుతున్నారనే అంశాల ఆధారంగా పర్యవేక్షణ కమిటీ ఎంపీల పనితీరును అంచనా వేస్తుంది. అలాగే ఎంపీలకు ర్యాంకులను కేటాయించనున్నారు.

Also Read: Maharashtra politics: తమ్ముడు నేటి నుంచి.. అన్నయ్య రేపటి నుంచి..


పెరిగిన బలం..

లోక్‌సభలో 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 99 మంది ఆ పార్టీ ఎంపీలు గెలుపొందారు. దీంతో ఆపార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారికంగా ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. దీంతో రాహుల్ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవడంతో ఆయన ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంపై దృష్టిపెట్టారు. రాహుల్ వచ్చే నెల మొదటివారంలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. వారం రోజుల పాటు కాలిఫోర్నియా, చికాగోలో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాహుల్ వాషింగ్టన్‌‌లో కూడా పర్యటించే అవకాశం ఉంది. అమెరికాలోని ప్రవాస భారతీయులతో పాటు యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.


రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై నిషేధం వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఐవోఏ

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 08 , 2024 | 08:16 PM