Share News

PM Modi: ఎంత బురద జల్లితే కమలం అంత వికసిస్తుంది.. ప్రతిపక్షాలపై మోదీ పదునైన విమర్శలు

ABN , Publish Date - May 28 , 2024 | 02:51 PM

అవినీతిరహిత పాలన అందిస్తున్నందుకు ప్రతిపక్ష నేతలు తనపై కోపం పెంచుకున్నారని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. దేశంలో మళ్లీ అవినీతి రాజ్యం తెచ్చేందుకు తనను ప్రధాని పదవి నుంచి దింపేయాలని కుట్రలు పన్నుతున్నట్లు మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

PM Modi: ఎంత బురద జల్లితే కమలం అంత వికసిస్తుంది.. ప్రతిపక్షాలపై మోదీ పదునైన విమర్శలు

రాంచీ: అవినీతిరహిత పాలన అందిస్తున్నందుకు ప్రతిపక్ష నేతలు తనపై కోపం పెంచుకున్నారని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. దేశంలో మళ్లీ అవినీతి రాజ్యం తెచ్చేందుకు తనను ప్రధాని పదవి నుంచి దింపేయాలని కుట్రలు పన్నుతున్నట్లు మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం జార్ఖండ్‌లోని దుమ్కాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.


"జార్ఖండ్‌(Jharkhand)లోని జేఏఎం ప్రభుత్వం అనేక కుంభకోణాలు చేసి డబ్బు సమకూర్చుకుంటోంది. జేఎంఎం(JMM), కాంగ్రెస్(Congress), ఆర్జేడీ(RJD) బహిరంగంగా నన్ను బెదిరిస్తున్నాయి. మోదీని తొలగించి మళ్లీ స్కాంలు చేయాలనుకుంటున్నారు. జేఎంఎం, కాంగ్రెస్‌లు జార్ఖండ్‌ను అన్ని విధాలుగా లూటీ చేస్తున్నాయి. ఇక్కడ చాలా అందమైన పర్వతాలు ఉన్నాయి. కానీ జార్ఖండ్‌లో బయటపడుతున్న నోట్ల పర్వతాల గురించే దేశం మాట్లాడుతోంది. జేఎంఎం, కాంగ్రెస్‌ వ్యక్తుల ఇళ్లల్లో నోట్లకట్టలు పట్టుబడుతున్నాయి.

ఇంత డబ్బు మద్యం కుంభకోణం నుంచి, టెండర్ స్కాం నుంచి, మైనింగ్ స్కాం నుంచి వస్తోంది. ప్రతిపక్ష నేతలు సైనికుల భూమిని సైతం వదల్లేదు. భూములను లాక్కోవడానికి వారు తమ తల్లిదండ్రుల పేర్లను మార్చుకున్నారు. రాష్ట్రంలో పేదలు, గిరిజనుల భూములు కబ్జా అయ్యాయి. వీరి చెర నుంచి జార్ఖండ్‌కి విముక్తి లభించాలి”అని మోదీ వ్యాఖ్యానించారు.


రిజర్వేషన్లపై...

ముస్లిం రిజర్వేషన్ అంశంపై ప్రతిపక్షాలపై విరుచుకుపడిన మోదీ తాను జీవించి ఉన్నంత కాలం ఓబీసీల రిజర్వేషన్లను లాక్కోలేరని అన్నారు. ‘‘ఇండియా కూటమి నేతలు ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తారు. మోదీ జీవించి ఉన్నంత కాలం గిరిజనులు, దళితులు, వెనకబడిన తరగతుల రిజర్వేషన్లను లాక్కోలేరు. హిందూ, ముస్లిం అంశం తీసుకొచ్చి నాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు. కమలంపై ఎంత బురదజల్లితే అంత వికసిస్తుస్తుంది" అని మోదీ పేర్కొన్నారు. జూన్ 1న చివరి దశ లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.

Dera Baba: ఆ హత్య కేసులో డేరా బాబాకు ఊరట.. నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు

For More National News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 03:13 PM