కొవాక్సిన్‌తోనూ దుష్ప్రభావాలు!
ABN , Publish Date - May 17 , 2024 | 05:48 AM
కొవిడ్-19 దేశీయ టీకా కొవాక్సిన్ తీసుకున్న వారిలో ఏడాది తర్వాత దుష్ప్రభావాలు ఎదురవుతున్నట్లు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్‌యూ) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
న్యూఢిల్లీ, మే 16: కొవిడ్-19 దేశీయ టీకా కొవాక్సిన్ తీసుకున్న వారిలో ఏడాది తర్వాత దుష్ప్రభావాలు ఎదురవుతున్నట్లు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్‌యూ) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కొవాక్సిన్ తీసుకున్న 926 మంది(635 మంది కౌమార దశలో ఉన్నవారు,
291 మంది పెద్దలు)పై 2022 జనవరి నుంచి 2023 ఆగస్టు వరకు నిర్వహించిన అధ్యయనంలో 30ు మందిపై తీవ్ర దుష్ప్రభావాలు కనిపించాయని పరిశోధకులు వెల్లడించారు.
ఈ టీకా తీసుకున్న కొందరిలో అడ్వర్స్ ఈవెంట్స్ ఆఫ్ స్పెషల్ ఇంట్రె్‌స్ట(ఏఈఎ్‌సఐ) లక్షణాలు కనిపించాయని, స్ట్రోక్, గిలాన్-బెరె డిజార్డర్ వంటి రుగ్మతలు ఏఈఎ్‌సఐ కోవలో ఉంటాయని ఈ పరిశోధన తెలిపింది.