Share News

Bengaluru: బెంగళూరు ఘటనలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య..

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:23 AM

తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బెంగళూరు నగరాన్ని వరదనీటితో ముంచెత్తాయి. పలు కాలనీలు జలమయం అయ్యాయి. వాహనదారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Bengaluru: బెంగళూరు ఘటనలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య..

కర్ణాటక: బెంగళూరు (Bengaluru)లో భవనం కూలిపోయిన (Building Collapse) ఘటనలో మృతుల సంఖ్య ఐదుకి చేరింది. తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం సాయంత్రం బాబూసాపాల్య ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ప్రమాద సమయంలో ముందు ఒకరు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు మరో నాలుగు మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాద సమయంలో భవనం లోపల 20కార్మికులు పని చేస్తున్నట్లు గుర్తించారు. వారిలో 17మంది శిథిలాల కింది చిక్కుకుపోగా, ఇప్పటివరకూ 14మందిని రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‪గా మారాయి.


వర్షాల వల్లే ప్రమాదం..

తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బెంగళూరు నగరాన్ని వరదనీటితో ముంచెత్తాయి. ఆదివారం ఉదయం నుంచీ మంగళవారం వరకూ ఆగకుండా వర్షం కురిసింది. దీంతో 186.2 మి.మీ. వర్షపాతం నమోదు అయిందని వాతావరణ శాఖ తెలిపింది. పలు కాలనీలు జలమయం అయ్యాయి. వాహనదారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో బెంగళూరులో వర్షం కురవలేదని పేర్కొంది.


అయితే 1997లో 178.9 మి.మీ. వర్షపాతం నమోదైందని, ఆ రికార్డును ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు అధిగమించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వరదనీరు చేరింది. దీంతో సామగ్రి, వాహనాలు, టీవీ ఫ్రీజ్‌లు సహా వస్తువులన్నీ నీట మునిగాయి. అలాగే పలు ముఖ్యమైన ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీని వల్లే భవనం కింద నేల కుంగిపోయి ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Viral Video: టాప్ లెస్ కారులో అంబానీ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తోందో..

Social Media: యువత కోసం కొత్త డిగ్రీ తెచ్చిన ఐర్లాండ్.. క్రేజ్ మామూలుగా లేదుగా..

Updated Date - Oct 23 , 2024 | 11:44 AM