Share News

Delhi : వీధి వ్యాపారుల రిజిస్ట్రేషన్‌ ఫీజు రద్దు చేయండి: నడ్డా

ABN , Publish Date - Jul 21 , 2024 | 05:57 AM

వీధుల్లో ఆహార పదార్థాలు విక్రయించే చిరు వ్యాపారులకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా శుభవార్త చెప్పారు. వారు ప్రతి ఏటా ఆహార సురక్ష, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ)కి చెల్లించాల్సిన నూరు రూపాయల రిజిస్ట్రేషన్‌ ఫీజును ..

Delhi : వీధి వ్యాపారుల రిజిస్ట్రేషన్‌ ఫీజు రద్దు చేయండి: నడ్డా

న్యూఢిల్లీ, జూలై 20: వీధుల్లో ఆహార పదార్థాలు విక్రయించే చిరు వ్యాపారులకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా శుభవార్త చెప్పారు. వారు ప్రతి ఏటా ఆహార సురక్ష, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ)కి చెల్లించాల్సిన నూరు రూపాయల రిజిస్ట్రేషన్‌ ఫీజును రద్దు చేయాలని ఆ సంస్థకు సూచించారు.

శనివారం ఇక్కడి విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన 1,350 మంది వీధి ఆహార వ్యాపారుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఏటా రూ.12 లక్షలలోపు టర్నోవర్‌ ఉన్నవారు వంద రూపాయల రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉండగా దాన్ని మాఫీ చేయాలని సూచించారు. కాగా, దేశ వ్యాప్యంగా స్ట్రీట్‌ ఫుడ్‌ వెండర్స్‌ హబ్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నడ్డా తెలిపారు. యువత పీఎం స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి (పీఎం స్వానిఽధి) పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - Jul 21 , 2024 | 05:57 AM