Share News

Delhi: వామ్మో.. వీడేంటి.. ఏకంగా హైటెన్షన్

ABN , Publish Date - Oct 23 , 2024 | 09:37 PM

దేశ రాజధాని ఢిల్లీలో.. పట్టపగలు ఓ వ్యక్తి పోలీసులు, ఫైర్ సిబ్బందిని పరుగులు పెట్టించాడు. హైటెన్షన్ పోల్ ఎక్కి సీజే, ముఖ్యమంత్రి లేదంటే ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడించాలని డిమాండ్ చేశాడు.

Delhi:  వామ్మో.. వీడేంటి.. ఏకంగా హైటెన్షన్
Delhi Man Climbs High-Tension Pole

వార్తల్లో ఉండాలనో.. లేదంటే సెన్సేషనల్ అవ్వాలనో కొందరు ఫీట్లు చేస్తుంటారు. ఒకతను అలానే ఢిల్లీలో ప్రవర్తించాడు. పోలీసుల ముందు డిమాండ్లు ఉంచాడు. వాటిని తప్పకుండా నెరవేర్చాలని భీష్మించుకొని కూర్చొన్నాడు. హైటెన్షన్ పోల్ ఎక్కి కాసేపు హడలెత్తించాడు. పోలీసులు, ఫైర్ సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించాడు.


హైటెన్షన్ పోల్

ఢిల్లీ యమునా ఖాదర్ ప్రాంతం.. సమయం బుధవారం మధ్యాహ్నం.. అంతా తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఓ వ్యక్తి హైటెన్షన్ పోల్ ఎక్కాడు. ఆ విషయం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది కూడా వచ్చారు. కిందకు దిగమని కోరితే.. లేదు రానని మొండి కేశాడు. ఏం కావాలని అడిగితే హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో మాట్లాడతానని చెప్పాడు. దీంతో ఖంగుతినడం పోలీసుల వంతయ్యింది.


సీజేతో మాట్లాడుతా..

సీజేతో మాట్లాడటం కుదరదని పోలీసులు తెగేసి చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రితో మాట్లాడించాలని మారాం చేశాడు. అది కుదరదని చెబితే.. ప్రధాని మోదీతో మాట్లాడుతానని స్పష్టం చేశారు. అతనికి సర్ది చెప్పేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఇబ్బంది పడ్డారు. వారితో ఏం మాట్లాడుతావని ప్రశ్నిస్తే.. పర్యావరణ పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని కోరతానని సెలవిచ్చాడు. దీంతో మరోసారి పోలీసులు ఆశ్చర్య పోవాల్సి వచ్చింది.


Untitled-1.jpg


బెంగాల్.. బీహార్

హైటెన్షన్ పోల్ ఎక్కిన వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. అతని భాషను బట్టి బెంగాల్ లేదంటే బీహార్‌కు చెందినవారని పోలీసులు భావిస్తున్నారు. అతనికి సర్ది చెప్పి.. ఎలాగోలా కిందకి దించారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Oct 23 , 2024 | 09:37 PM