Share News

New Traffic Rules: ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ మీకు తెలుసా?

ABN , Publish Date - Aug 12 , 2024 | 01:22 PM

కేంద్ర ప్రభుత్వ కొత్తగా తీసుకువచ్చిన క్రిమినల్ లా చట్టాలతో మరికొన్ని చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. ఈ నెల ప్రారంభం నుంచే ఈ చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే, వీటితో పాటు.. నూతన రహదారి భద్రతా నిబంధనలు కూడా మారాయి.

New Traffic Rules: ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ మీకు తెలుసా?
New Traffic Rules

హైదరాబాద్, ఆగష్టు 12: కేంద్ర ప్రభుత్వ కొత్తగా తీసుకువచ్చిన క్రిమినల్ లా చట్టాలతో మరికొన్ని చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. ఈ నెల ప్రారంభం నుంచే ఈ చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే, వీటితో పాటు.. నూతన రహదారి భద్రతా నిబంధనలు కూడా మారాయి. ఈ నూతన చట్టాల ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై, రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా మైనర్ల డ్రైవింగ్ విషయంలో చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఎవరైనా మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కారో.. భారీ జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష కూడా విధించనున్నారు. కొత్త చట్టాల ప్రకారం.. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 25 వేల జరిమానా, 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ రద్దు చేయనున్నారు. అలాగే పరిస్థితిని బట్టి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. మరి మారిన ట్రాఫిక్ రూల్స్ గురించి మీకు తెలుసా? తెలియకపంతే ఇప్పుడు చూసేయండి..


కొత్త ట్రాఫిక్ నిబంధనలు, శిక్షలు..

1. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ జంప్ చేస్తే రూ. 500 జరిమానా విధించనున్నారు.

2. అథారిటీ ఆదేశాలను ధిక్కరిస్తే రూ.2,000 జరిమానా విధించనున్నారు.

3. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రూ. 5,000 జరిమానా.

3. అతివేగం - రూ.1000 జరిమానా.

4. ర్యాష్ డ్రైవింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్ - రూ.5,000.

5. డ్రంక్ అండ్ డ్రైవ్ - రూ.10,000.

6. రేసింగ్, స్పీడింగ్ - రూ.5,000.

7. హెల్మెట్ ధరించకపోవడం - రూ.1000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు.

8. సీట్‌బెల్ట్ ధరించకపోవడం - రూ.1000.

9. అత్యవసర వాహనాలను అడ్డుకుంటే - రూ.10,000.

10. బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ - రూ.1,200.

11. ద్విచక్ర వాహనాలపై ఓవర్‌లోడ్ - రూ.2,000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు.

12. ఇన్సూరెన్స్‌ లేకుండా డ్రైవింగ్ - రూ.2,000.


Also Read:

రాహుల్‌ గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

కూటమి అభ్యర్థిపై నేడు వీడనున్న ఉత్కంఠ!

షేక్ హసీనాకు భారత్ ఆశ్రయంపై కాంగ్రెస్ ఎంపీ

For More National News and Telugu News..

Updated Date - Aug 12 , 2024 | 01:22 PM