Share News

Rahul Gandhi: యూఎస్ పర్యటనలో మళ్లీ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 10 , 2024 | 10:33 AM

మూడు రోజుల పర్యటనలో భాగంగా లోక్‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా వరుసగా వివిధ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఆ క్రమంలో ప్రఖ్యాత జార్ట్ టౌన్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో మంగళవారం రాహుల్ గాంధీ సమావేశమయ్యారు.

Rahul Gandhi:  యూఎస్ పర్యటనలో మళ్లీ కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్, సెప్టెంబర్ 10: మూడు రోజుల పర్యటనలో భాగంగా లోక్‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా వరుసగా వివిధ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఆ క్రమంలో ప్రఖ్యాత జార్ట్ టౌన్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో మంగళవారం రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీతోపాటు దాని అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పై ఆరోపణలు గుప్పించారు.


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల వేళ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యవహరించిన తీరును ఈ సందర్బంగా ఆయన ఎండగట్టారు. ఈ ఎన్నిలకు ముందు విద్యా విధానం, మీడియా, దర్యాప్తు సంస్థలను ఈ రెండు ఎలా తమ అధీనంలోకి తీసుకుంది రాహుల్ గాంధీ వివరించారు. ఇదే విషయాన్ని తాము ఎన్నికల ముందు ప్రజలకు చెప్పాము. కానీ నాడు ప్రజలకు ఈ విషయం మాత్రం అర్థం కాలేదన్నారు. అంతేకాదు.. రాజ్యాంగం చదవాలంటూ నాడు బీజేపీ నేతలు తమకు సూచించారని తెలిపారు. రాజ్యాంగంలో ఉన్న అంశాలకు, బయట జరుగుతున్న అంశాలకు ఏ మాత్రం పొంతన లేకుండా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.


ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు స్వేచ్చగా నిష్పక్షపాతంగా జరగలేదన్నారు. అందుకే బీజేపీకి 240 సీట్లు దక్కాయని చెప్పారు. ఈ ఎన్నికలే స్వేచ్చగా నిష్పక్షపాతంగా జరిగి ఉంటే ఆ పార్టీకి అన్ని సీట్లు వచ్చి ఉండేవి కావని ఆయన తెలిపారు. ఎన్నికల వేళ.. తమ బ్యాంక్ ఖాతాలను స్తంభించ చేసి.. వారు మాత్రం ఆర్థికంగా లబ్ది పొందారని చెప్పారు. అదీకాక వారికి ఎలా కావాలో అలా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందని విమర్శించారు. దేశంలోని వివిధ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అజెండా మేరకే చేశారన్నారు. అందులోభాగంగా వివిధ రాష్ట్రాల్లో పలు విధాలుగా ప్రచారం సాగిందని రాహుల్ గాంధీ ఈ సందర్బంగా గుర్తు చేశారు.


రానున్న రెండు మూడు మాసాల్లో జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ భ్రష్టు పట్టించిన సంస్థలను మళ్లీ గాడీలోకి తీసుకు వస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఆ క్రమంలో బీజేపీ 300 నుంచి 400 సీట్లు గెలుస్తుందంటూ ఆయన ప్రకటించారన్నారు. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీకి 240 స్థానాలకే పరిమితమైందని చెప్పారు. అలాగే తాను దేవునితో నేరుగా సంభాషిస్తానంటూ మోదీ చేసిన నాటి వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రస్తావించారు. మోదీ మానసిక పరిస్థితిపై రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధాని మోదీ అంటే తనకు కోపం లేదన్నారు. కానీ ఆయన చూసే దృకోణంపైనే తన ఆగ్రహమంతా అని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులోభాగంగా సోమవారం టెక్సాస్‌లోని ఓ సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా భారత్‌లో లెక్కలేనంత ప్రతిభ ఉందన్నారు. కానీ ఆ ప్రతిభకు మాత్రం దేశంలో చోటు లేదన్నారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. భారత్ పరువు తీయడానికి రాహుల్ విదేశాల్లో పర్యటిస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విధితమే.

Read More National News and Latest Telugu News Click Here

Updated Date - Sep 10 , 2024 | 10:33 AM