Viral Video: ఎండ వేడి నుంచి ఉపశమనం.. సిబ్బందికి ఏసీ జాకెట్స్ ఐడియా అదుర్స్
ABN , Publish Date - Jun 15 , 2024 | 01:35 PM
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు(heat wave) మండిపోతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా పలు ప్రాంతాల్లో హీట్ వేవ్ తీవ్రంగా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏసీ జాకెట్ ధరించిన పోలీసుల గురించి వార్త చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు(heat wave) మండిపోతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా సహా పలు ప్రాంతాల్లో హీట్ వేవ్ తీవ్రంగా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అయితే ఎంత వర్షం వచ్చినా, ఎండ ఉన్నా కూడా ట్రాఫిక్ సిబ్బంది మాత్రం వారి విధులను రోడ్లపైనే నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారి కోసం ప్రత్యేక ఏసీ జాకెట్లను తయారు చేయించారు. వాటిని ధరించి ఈ వేసవిలో వారు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ఏసీ జాకెట్ ధరించిన తర్వాత అది ధరించిన సిబ్బందిని చల్లగా ఉంచుతుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో గురుగ్రామ్‌లోని పోలీసు(Gurugram Police), ట్రాఫిక్ సిబ్బందికి ఈ కూలింగ్ జాకెట్లను పంపిణీ చేశారు. దీంతో ఇప్పుడు పోలీసు సిబ్బంది ఈ జాకెట్లు ధరించి డ్యూటీ చేస్తున్నారు. ఈ జాకెట్‌తో ఈ వేసవి కాలంలో ఎండ వేడి నుంచి రక్షణ లభిస్తుంది. ఈ జాకెట్ ప్రత్యేకత ఏమిటంటే ఇది 8 గంటల పాటు సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతను తట్టుకుంటుందని అధికారులు తెలిపారు. జాకెట్ లోపల చొక్కా ధరించి దీనిని వేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అయితే ఈ జాకెట్‌కి రెండు చిన్న ఫ్యాన్లు ఉన్నాయి. ఈ మొత్తం జాకెట్ కిట్ బరువు 500 గ్రాములుగా ఉంది. ఇందులో లి అయాన్ బ్యాటరీ కూడా కలదు. ఈ జాకెట్ PCM టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ సాంకేతికతతో ఈ జాకెట్ 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతను అందిస్తుంది. జాకెట్ల కోసం తయారు చేసిన PCM పౌచ్‌లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం ద్వారా సులభంగా రీఛార్జ్ చేయవచ్చు. అయితే ఈ జాకెట్ల గురించి తెలుసుకున్న పలువురు ఐడియా అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మాకు కూడా కావాలని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. వాటిని ఎక్కడ తయారు చేశారు, ఎలా తీసుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి:
Modi And Meloni: నరేంద్ర మోదీతో కలిసి నవ్వుతూ సెల్ఫీ దిగిన మహిళా ప్రధాని
Viral News: ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేశారు.. తీరా పార్సిల్ ఓపెన్ చేస్తే షాక్..
Read Latest National News and Telugu News