Share News

IMD: నేడు 14 రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఐఎండీ హెచ్చరిక

ABN , Publish Date - Aug 27 , 2024 | 08:24 AM

భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం పలు రాష్ట్రాలకు వర్ష సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు(rains) కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. అయితే వీటిలో ఏయే ప్రాంతాలు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

IMD: నేడు 14 రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఐఎండీ హెచ్చరిక
imd rain alert 14 states

దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం పలు రాష్ట్రాలకు వర్ష (rains) సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో గుజరాత్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు, మూడు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. IMD గుజరాత్‌ను ‘ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్’ జోన్‌గా ప్రకటించింది.


స్కూల్స్ బంద్

వర్షాల నేపథ్యంలో గుజరాత్‌లోని అన్ని ప్రాథమిక పాఠశాలలను మంగళవారం మూసివేస్తున్నట్లు విద్యా మంత్రి ప్రఫుల్ పన్షేరియా ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు గుజరాత్ వ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వర్షం కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఏడుగురు తప్పిపోయారు.


ఐఎండీ

ఈరోజు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో శీతల గాలులు వీస్తాయి. ఈ సాయంత్రానికి రాజధాని వాతావరణం మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈరోజు ఢిల్లీతో పాటు 14 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్‌లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో తుపాను వచ్చే అవకాశం ఉందని IMD తెలిపింది. గుజరాత్‌లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. వచ్చే 24 గంటల్లో మధ్యప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ వెల్లడించింది.


ఈ రాష్ట్రాల్లో వర్షాలు

మధ్యప్రదేశ్‌లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. సముద్రంలో అలలు ఎగసిపడే అవకాశం ఉందని సూచనలు జారీ చేసింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రానున్న 24 గంటల్లో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, హిమాచల్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే తెలంగాణలో వచ్చే ఆరు రోజులు కూడా వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ తెలుపగా, ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.


ఇవి కూడా చదవండి:

Jharkhand: జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరేందుకు తేదీ ఖరారు


Delhi : జమ్మూలో బీజేపీ అభ్యర్థులపై రగడ

ఖర్గే కుటుంబ సభ్యులు ఏరో స్పేస్‌ పారిశ్రామికవేత్తలా?



Read More National News and Latest Telugu News

Updated Date - Aug 27 , 2024 | 08:30 AM