Share News

Imphal : మణిపూర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాను మృతి

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:37 AM

మణిపూర్‌లో జిరిబం జిల్లాలోని మాంగ్‌బంగ్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్‌ఫ(సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌) జవాన్‌ మృతి చెందారు.

 Imphal : మణిపూర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాను మృతి

ఇంఫాల్‌, జూలై 14: మణిపూర్‌లో జిరిబం జిల్లాలోని మాంగ్‌బంగ్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్‌ఫ(సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌) జవాన్‌ మృతి చెందారు. దుండగులు తుపాకీతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మరణించిన జవాన్‌ను బిహార్‌కు చెందిన అజయ్‌ కుమార్‌ ఝాగా అధికారులు గుర్తించారు. తలలో బుల్లెట్‌ దిగడంతోనే ఆయన మరణించినట్లు వైద్యులు ద్రువీకరించారు. ఈ ఘటనలో మరో పోలీసుకు గాయాలయ్యాయి. కుకీలకు చెందిన మిలిటెంట్లే ఈ దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు

Updated Date - Jul 15 , 2024 | 04:39 AM