Share News

Chandipura Virus: పెరుగుతున్న చండీపురా వైరస్ కేసులు.. ఇప్పటికే 16 మంది మృతి

ABN , Publish Date - Jul 21 , 2024 | 08:04 AM

గత కొన్ని రోజులుగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో చండీపురా వైరస్(Chandipura virus) అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా ఒక్క గుజరాత్‌(gujarat)లోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధి ప్రభావం కనిపిస్తోంది.

Chandipura Virus: పెరుగుతున్న చండీపురా వైరస్ కేసులు.. ఇప్పటికే 16 మంది మృతి
Chandipura virus

గత కొన్ని రోజులుగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో చండీపురా వైరస్(Chandipura virus) అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా గుజరాత్‌(gujarat)లో 16 మంది ప్రాణాలు కోల్పోయారని, మొత్తం రాష్ట్రంలో 50 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. పలువురు నిపుణులతో కలిసి గుజరాత్(gujarat), రాజస్థాన్(rajasthan), మధ్యప్రదేశ్‌(madhya pradesh)లలో అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్, చండీపురా వైరస్ కేసులను సమీక్షించింది.


పెరుగుతున్న కేసులు

ఈ క్రమంలో గుజరాత్‌లో కనుగొనబడిన AES కేసులపై వివరణాత్మక దర్యాప్తు అవసరమని అధికారులు అన్నారు. దర్యాప్తులో గుజరాత్ రాష్ట్రానికి సహకరించేందుకు కేంద్ర బృందాన్ని(Health Ministry) రంగంలోకి దింపారు. ఈ వైరస్ సంక్రమణ పెరుగుతున్న దృష్ట్యా, ఆరోగ్య శాఖ బృందాలు మొత్తం 17,248 ఇళ్లలోని 121826 మందిని పరీక్షించాయి. దీంతోపాటు రెండు రాజస్థాన్ నుంచి, ఒకటి మధ్యప్రదేశ్ నుంచి కూడా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు.


చండీపురా వైరస్ అంటే ఏమిటి?

మహారాష్ట్ర(maharashtra) నాగ్‌పూర్‌లోని చాందీపూర్ గ్రామంలో 1966లో 15 ఏళ్లలోపు పిల్లలు చనిపోవడం ప్రారంభించారు. దీంతో వైరస్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని అప్పటి వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో అప్పటి నుంచి ఈ వైరస్‌కు చండీపూర్ వైరస్ అని పేరు పెట్టారు. ఆ తరువాత ఈ వైరస్ 2004 నుంచి 2006, 2019 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లలో గుర్తించబడింది. చండీపురా వైరస్ అనేది ఆర్‌ఎన్‌ఏ వైరస్. ఇది ఎక్కువగా ఆడ ఫ్లెబోటోమైన్ ఫ్లై ద్వారా వ్యాపిస్తుంది. దోమలలో కనిపించే ఈడిస్ దోమ దీని వ్యాప్తికి కారణం. జూన్ 2024 ప్రారంభం నుంచి గుజరాత్‌లో 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయి.


చండీపురా వైరస్ లక్షణాలు

చండీపురా వైరస్ కారణంగా రోగికి జ్వరం, విరేచనాల లక్షణాలు కనిపిస్తాయి. ఫ్లూ వంటి లక్షణాలతోపాటు(symptoms of Chandipura) తీవ్రమైన మెదడువాపు వ్యాధిని కలిగి ఉంటారు. ఈ వైరస్ దోమలు, ఈగలు, కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. అనేక రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, రసాయనాలు/టాక్సిన్‌లు మొదలైన వాటి వల్ల AES ఏర్పడుతుంది.

ముఖ్యమంత్రి ఆదేశం

వ్యాధి నివారణకు జిల్లాల్లో మలాథియాన్ పౌడర్‌ను పిచికారీ చేసేలా ప్రచారం నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రోగులకు ఎలాంటి జ్వరం వచ్చినా వెంటనే ఇంటెన్సివ్‌ ట్రీట్‌మెంట్‌ అందించాలని అధికారులను కోరారు. ఈ మహమ్మారిని నివారించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ సిస్టర్స్, అంగన్‌వాడీ వర్కర్ సిస్టర్స్ మరియు నర్సు సిస్టర్స్ వంటి అట్టడుగు స్థాయి కార్యకర్తలు చర్యలు తీసుకోవాలని గుజరాత్ ఆరోగ్య మంత్రి హృషికేష్ పటేల్ సూచించారు.


ఇవి కూడా చదవండి:

Paris Olympics 2024: మరికొన్ని రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్.. ఈసారి భారత్ నుంచి గతంలో కంటే..


పతకాలు పట్టుకొచ్చేదెవరు?


బ్యాంకులు భళా


Budget 2024: బడ్జెట్‌ 2024 నేపథ్యంలో పెరగనున్న స్టాక్స్ ఇవే..!


More National News and Latest Telugu News

Updated Date - Jul 21 , 2024 | 08:08 AM