Assembly by-polls: బీహార్‌లో జేడీయూకి ఎదురుదెబ్బ.. ఉప ఎన్నికలో ఎన్డీయే రెబల్ అభ్యర్థి గెలుపు..
ABN , Publish Date - Jul 13 , 2024 | 08:26 PM
లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. 13 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి 10స్థానాల్లో గెలుపొందగా, ఎన్డీయే కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. 13 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి 10 స్థానాల్లో గెలుపొందగా, ఎన్డీయే కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని రూపాలి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పెను సంచలనం నమోదైంది. ఇక్కడ ఎన్డీయే, ఇండియ కూటమి అభ్యర్థులకు ఇండిపెండెంట్ అభ్యర్థి షాక్ ఇచ్చారు. ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ విజయం సాధించారు. రూపాలీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఎన్‌డిఎ తరపున జెడియు అభ్యర్థి కళాధర్ మండల్ పోటీచేశారు. బీమా భారతి ఆర్జేడీ నుంచి పోటీ చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ స్థానానికి ఎమ్మెల్యేగా ఉన్న బీమా భారతి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. బీమా భారతి జేడీయూను వీడి ఆర్జేడీలో చేరి పూర్నియా నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పప్పు యాదవ్ విజయం సాధించారు. ప్రస్తుతం రూపాలి అసెంబ్లీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ విజయం సాధించారు.
Assembly Bypoll Results 2024: బద్రీనాథ్, మంగళౌర్‌లో కాంగ్రెస్ విక్టరీ
రెబల్ అభ్యర్థి విజయం..
అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు శంకర్ సింగ్ ఎల్జేపీకి రాజీనామా చేశారు. ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు శంకర్ సింగ్ టికెట్ అడిగారు. అయితే ఎన్డీయే కూటమి తరపున జేడీయూకి ఈ సీటు కేటాయించడంతో శంకర్ సింగ్ ఎల్జేపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత శంకర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మరోవైపు, ఎన్నికల ప్రచారంలో కళాధర్ మండల్‌కు జేడీయూ తన పూర్తి మద్దతు ప్రకటించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా తన మంత్రివర్గం మొత్తం రంగంలోకి దిగినప్పటికీ తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయింది.
Sanjay Raut on Emergency: వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నా ఎమర్జెన్సీ విధించి ఉండేవారు..
Rajnath Singh: ఎయిమ్స్ నుంచి రాజ్‌నాథ్ సింగ్ డిశ్చార్జి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News