Share News

First Lok Sabha Session: 18వ లోక్‌సభ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం..ఎప్పటి వరకంటే

ABN , Publish Date - Jun 12 , 2024 | 10:31 AM

దేశంలో 18వ లోక్‌సభ తొలి సెషన్‌(First Lok Sabha session) జూన్‌ 24 నుంచి ప్రారంభం కానుంది. దీంతోపాటు 264వ రాజ్యసభ సమావేశాలు జూన్ 27 నుంచి మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, లోక్‌సభ స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం సహా తదితర అంశాలపై చర్చించనున్నారు.

 First Lok Sabha Session: 18వ లోక్‌సభ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం..ఎప్పటి వరకంటే
18th Lok Sabha was from June 27th to July 3rd

దేశంలో 18వ లోక్‌సభ తొలి సమావేశాలు (First Lok Sabha session) జూన్‌ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతోపాటు 264వ రాజ్యసభ సమావేశాలు జూన్ 27 నుంచి మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, లోక్‌సభ స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగం సహా తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ సభల సమావేశాలు జూలై 3 వరకు కొనసాగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు(Kiren Rijiju) వెల్లడించారు.


సమావేశాల మొదటి మూడు రోజుల్లో కొత్తగా ఎన్నికైన నేతలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో పాటు సభాపతి ఎన్నిక కూడా జరగనుంది. జూలై 3న సెషన్‌ ముగుస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 27న లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ క్రమంలో వచ్చే ఐదేళ్ల కొత్త ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌ గురించి ఆమె వివరిస్తారు.


దూకుడుగా ప్రతిపక్షాలు

అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి ఫలితాలు పెరిగిన క్రమంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో ఇండియా కూటమి దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. వివిధ సమస్యలపై ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించవచ్చు. దీంతో పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు.


ఇది కూడా చదవండి:

Terrorists Attack: కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడి..ఆర్మీ బేస్‌పై కాల్పులు, ఒకరు మృతి

RSS Mohan Bhagwat : నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు


Ratan Sharada : అతివిశ్వాసమే బీజేపీని ముంచింది!


Read Latest National News and Telugu News

Updated Date - Jun 12 , 2024 | 10:42 AM