Haryana Assembly Elections: కాంగ్రెస్‌తో పొత్తు లేదు.. తొలి జాబితా విడుదల: ఆప్
ABN , Publish Date - Sep 09 , 2024 | 06:55 PM
వచ్చే నెలలో హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టత ఇచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పొట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపుతామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 09: వచ్చే నెలలో హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టత ఇచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పొట్టుకోవడం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపుతామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం హరియాణా ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ చీఫ్ సుశీల్ గుప్తా విలేకర్లతో మాట్లాడుతూ.. పొత్తు విషయాలను వెల్లడించారు.
Also Read: Delhi: ఉన్నతాధికారి ఇంట్లో సీబీఐ సోదాలు: రూ. 2.39 కోట్లు సీజ్
బలమైన కాంగ్రెస్‌తో కలిసి పొత్తు పెట్టుకోని అసెంబ్లీ ఎన్నికల్లో వెళ్లాలని తాము వేచి చూశామన్నారు. ఆ క్రమంలో తాము సహనంతో వేచి చూశామని చెప్పారు. అనంతరం తమ పార్టీ అభ్యర్థులతో జాబితాను విడుదల చేసేందుకు సిద్దమయ్యామని వివరించారు. అయితే తాము జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నామన్న విషయం మరవరాదని ఈ సందర్భంగా సుశీల్ గుప్తా పేర్కొన్నారు. ఆ కొద్ది సేపటికే 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ఆప్ విడుదల చేసింది. మరికొన్ని గంటల్లో మిగిలిన అభ్యర్థుల జాబితాను సైతం ప్రకటిస్తామని పార్టీ స్పష్టం చేసింది.
Also Read: Uttar Pradesh: 9 రోజుల తర్వాత.. ఎట్టకేలకు దొరికిన మృతదేహం.. ఎవరిదంటే..?
ఈ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్, ఆప్ పొత్తు పెట్టుకోంటాయని ఓ ప్రచారం అయితే బలంగానే సాగింది. ఆ క్రమంలో ఇరు పార్టీలు పలు దఫాలుగా చర్చలు సైతం జరిపాయి. కానీ సీట్ల సర్దుబాటులో ఈ రెండు పార్టీలు ఏకభిప్రాయానికి రాలేకపోయాయనే ఓ చర్చ సైతం సాగుతుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో పలు సీట్ల కోసం ఆప్ పట్టు పట్టగా.. అందుకు కాంగ్రెస్ పార్టీ ససేమీరా అందని సమాచారం. దీంతో మీకు మీరే.. మాకు మేమే అన్నట్లుగా ఈ రెండు పార్టీల వైఖరి స్పష్టమైంది. ఇక హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ వేసేందుకు తుది గడువు సెప్టెంబర్ 12వ తేదీ సాయింత్రంతో ముగియనుంది.
Also Read: RG Kar Medical Student: వైద్యురాలి తండ్రి ఆరోపణలు ఖండించిన సీఎం మమత.. ఇదంతా కుట్ర
అలాగే ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో హరియాణాలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు కలిసి మొత్తం 10 స్థానాల్లో పోటీ చేశాయి. 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలపగా.. ఆప్ పార్టీ ఒక్క స్థానంలో అభ్యర్థిని బరిలో దింపింది. కాంగ్రెస్ పార్టీ 5 ఎంపీ స్థానాలను గెలుచుకోగా.. ఆప్ పార్టీ మాత్రం ఒక్క స్థానంలో పోటీ చేసి.. ఆ స్థానంలో సైతం ఓటమి పాలైంది. దీంతో హరియాణాలో ఆప్ పార్టీ ప్రభావం చాలా బలహీనంగా ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులోభాగంగానే ఆప్‌తో పొత్తుపై కాంగ్రెస్ వెనకడుగు వేసిందనే ఓ ప్రచారం సైతం సాగుతుంది.
Also Read: Ganesh Chaturthi: తొలి రోజే ఈ ‘గణపతి’రికార్డు
Read More National News and Latest Telugu News Click Here