Share News

Rahul Gandhi: రాజ్యాంగంపై దాడి.. ప్రధాని మోదీపై రాహుల్ ఫైర్..

ABN , Publish Date - Aug 18 , 2024 | 06:38 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ రాజ్యాంగంపై, రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తున్నారని అన్నారు. ఉన్నత ఉద్యోగాల్లో లేటరల్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను బహిరంగంగానే లాక్కుంటున్నారని రాహుల్ గాంధీ విమర్వించారు.

Rahul Gandhi: రాజ్యాంగంపై దాడి.. ప్రధాని మోదీపై రాహుల్ ఫైర్..
Rahul Gandhi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ రాజ్యాంగంపై, రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తున్నారని అన్నారు. ఉన్నత ఉద్యోగాల్లో లేటరల్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను బహిరంగంగానే లాక్కుంటున్నారని రాహుల్ గాంధీ విమర్వించారు. ప్రభుత్వ ఉద్యోగా నియామకం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ద్వారా కాకుండా.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ద్వారా జరుగుతోందని ఆరోపించారు. అత్యున్నత బ్యూరోక్రసీ వ్యవస్థతో పాటు దేశంలోని అన్ని అత్యున్నత స్థానాల్లో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం లేదని తాను ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నానని, ఆ వ్యవస్థను మెరుగుపరచడానికి బదులు, లేటరల్ ఎంట్రీ ద్వారా అణగారిన వర్గాలకు అత్యున్నత స్థానాల్లో చోటులేకుండా చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన లేటరల్‌ విధానం యుపిఎస్‌సికి సిద్ధమవుతున్న ప్రతిభావంతులైన ఎంతోమంది యువత హక్కులను దోచుకునేలా ఉందన్నారు. ఈ విధానాన్ని అణగారిన వర్గాలకు చెందాల్సిన రిజర్వేషన్లను లాక్కోవడంతో పాటు సామాజిక న్యాయంపై దాడిగా రాహుల్ పేర్కొన్నారు.


ఆ విధానానికి వ్యతిరేకం-రాహుల్ గాంధీ

లేటరల్ విధానం ద్వారా కేంద్రప్రభుత్వం ఐఏఎస్‌లను ప్రైవేటీకరిస్తుందని ఆరోపించారు. రిజర్వేషన్లను అంతం చేయడానికి ఇది మోదీ ఇచ్చిన హామీగా పేర్కొన్నారు. కీలకమైన ప్రభుత్వ పదవుల్లో బయట వ్యక్తులను కూర్చోబెట్టడం ద్వారా కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ఎలాంటి దోపిడీ చేస్తారో చెప్పడానికి సెబీ ఉదాహరణ అని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రయివేట్ రంగం నుండి వచ్చిన వ్యక్తిని మొదటిసారి చైర్‌పర్సన్‌గా నియమించారని ఆయన అన్నారు. ఇలాంటి చర్యల కారణంగా పరిపాలనా నిర్మాణం, సామాజిక న్యాయం రెండూ దెబ్బతింటున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.


నిరసనలకు అఖిలేష్ పిలుపు..

యూపీఎస్సీలో లేటరల్ విధానాన్ని సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు వ్యతిరేకించాయి. ఈ పథకానికి వ్యతిరేకంగా అక్టోబర్‌ 2న పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయడాన్ని సహించబోమన్నారు. మరోవైపు బీఎస్పీ చీఫ్ మాయావతి సైతం లేటరల్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ప్రస్తుతం ఉన్న అధికారులతో పాటు యువత భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి అవకాశాలు లేకుండా చేస్తుందని మాయవతి పేర్కొన్నారు. 45 ఉన్నత ఉద్యోగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నిర్ణయం సరికాదన్నారు. ఎలాంటి నియమాక ప్రక్రియ లేకుండా ఖాళీలను భర్తీ చేయడం సరికాదని.. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని మాయావతి పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 18 , 2024 | 06:38 PM