Share News

Narendra Modi: మూడోసారి ప్రధానిగా మోదీ.. ప్రమాణ స్వీకారానికి తేదీ ఖరారు!

ABN , Publish Date - Jun 05 , 2024 | 01:23 PM

ఎన్డీఏ సర్కారు మరోసారి కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టబోతోంది. దీంతో నరేంద్ర మోదీ(PM Modi Oath Taking Ceremony) మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.

Narendra Modi: మూడోసారి ప్రధానిగా మోదీ.. ప్రమాణ స్వీకారానికి తేదీ ఖరారు!

ఢిల్లీ: ఎన్డీఏ సర్కారు మరోసారి కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టబోతోంది. దీంతో నరేంద్ర మోదీ(PM Modi Oath Taking Ceremony) మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి జూన్ 8వ తేదీని ఖరారు చేసినట్లు ఎన్డీఏ(NDA) వర్గాలు చెబుతున్నాయి. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నాయి.

లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ 292 సీట్లు సాధించి మెజారిటీ మార్క్ దాటింది. 543 సీట్లున్న లోక్ సభలో అధికారం చేపట్టడానికి 272 సీట్లు సాధించాలి. ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కలిపి మెజారిటీని దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈసారి మోదీ మూడో సారి ప్రధానిగా బాధ్యతలు తీసుకోనున్నారు.


చివరి కేబినెట్ భేటీ..

మోడీ 2.0 క్యాబినెట్, మంత్రి మండలి బుధవారం ఉదయం 11.30కు సమావేశమయ్యాయి. జూన్ 16తో ప్రస్తుత ప్రభుత్వం గడువు ముగుస్తుంది. దీంతో లోక్‌సభను రద్దు చేయాలని కేబినెట్ సిఫార్సు చేస్తుంది. కాగా, సాయంత్రం 4 గంటలకు జరిగే కూటమి సమావేశానికి ఎన్డీయే సీనియర్ నేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీయే నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఏపీకి కాబోతున్న సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు హాజరుకానున్నారు.


బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు పలు డిమాండ్లు పెడుతున్నాయి. జేడీ(యూ) 3 కేబినెట్ సీట్లు కోరగా, ఏక్నాథ్ షిండే శివసేన వర్గం పలు పదవులపై పట్టుబడుతోంది.

చంద్రబాబు కూడా పలు పదవులు కోరే అవకాశం లేకపోలేదు. బీజేపీకి ఈ సారి ఏకపక్ష మెజారిటీ రాకపోవడం, ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకోవడంతో మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ, జేడీయూ కీలకంగా మారనున్నాయి.

NDA Alliance: అందరి చూపు వారివైపే.. కింగ్ మేకర్లుగా బాబు, నితీశ్

For Latest News and National News Click Here

Updated Date - Jun 05 , 2024 | 01:53 PM