President Murmu: ఆ పనిచేస్తే సహించేది లేదు.. రాష్ట్రపతి వార్నింగ్..
ABN , Publish Date - Jun 27 , 2024 | 01:24 PM
దేశాభివృద్ధి ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆకాంక్షించారు.. 18వ లోక్‌సభ తొలి సమావేశాల నాలుగోరోజు ఆమో పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు.. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆమె తన ప్రసంగంలో వివరించారు.
దేశాభివృద్ధి ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆకాంక్షించారు.. 18వ లోక్‌సభ తొలి సమావేశాల నాలుగోరోజు ఆమో పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు.. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆమె తన ప్రసంగంలో వివరించారు. CAA ప్రకారం శరణార్థులకు ప్రభుత్వం పౌరసత్వం మంజూరు చేయడం ప్రారంభించిందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచే ప్రతి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. దేశ ఖ్యాతిని దిగజార్చేలా ఎవరూ వ్యవహరించకూడదన్నారు.
ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం..
గత పదేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుతం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత ఆరోగ్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. గతంలో తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలతో దేశంలో ఎన్నో మార్పులు తీసుకురాగలిగామని చెప్పారు. జీఎస్టీ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్యం, వ్యాపార కార్యకలాపాలు సులభతరమయ్యాయన్నారు.
సుస్థిరతకు పట్టం..
దేశ ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సుస్థిరత, నిజాయతీని నమ్మారని అన్నారు. పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని తెలిపారు. రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ఆధారంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. పంటలకు మద్దతు ధరకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. వ్వవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని.. ప్రజాక్షేమం కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలకు ప్రోత్సాహం అందిస్తున్నామని.. రైతుల సంక్షేమం కోసం అతి పెద్ద నెట్‌వర్క్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు.
గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో అడవుల విస్తరణ ఉంటుందన్నారు. ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌తో దేశ ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తున్నామని, చిన్నరైతులకు పీఎం సమ్మాన్ నిధి ఏర్పాటు చేసినట్లు రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని, పెట్టుబడులు, ఉపాధికల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చామన్నారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రజలు విశ్వసించారని.. ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని రాష్ట్రపతి తెలిపారు. ప్రపంచవ్యాప్త డిమాండ్ మేరకు భారత్ ఉత్పత్తులు అందిస్తోందన్నారు. ఆరోగ్య రంగంలో భారత్ అగ్రగామిగా ఉందని తెలిపారు. తమ దేశం వేగంగా పురోగతి సాధిస్తోందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News