అవిముక్తేశ్వరానంద్ : ప్రధాని, రాష్ట్రపతి హిందువులు కాదు!
ABN , Publish Date - Sep 25 , 2024 | 03:12 AM
నిర్మాణమే పూర్తి కాని అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూజలు ఏమిటని ప్రశ్నించి అప్పట్లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అందుకే గోహత్యను నిషేధించటం లేదు
హిందువుల పవిత్రతను దెబ్బ తీయడానికే తిరుపతి లడ్డూ కల్తీ: అవిముక్తేశ్వరానంద్
లక్నో, సెప్టెంబరు 24: నిర్మాణమే పూర్తి కాని అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూజలు ఏమిటని ప్రశ్నించి అప్పట్లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో గోహత్యను నిలిపివేయని ప్రధాని, రాష్ట్రపతి అసలు హిందువులే కాదన్నారు. ఇప్పటి వరకూ ఆ అత్యున్నత పదవులను అధిష్ఠించిన వారెవరూ హిందువులు కాదని, కాబట్టే, దేశంలో గోహత్య ఇప్పటికీ కొనసాగుతోందని విమర్శించారు. యూపీలో మహంత్ యోగి సీఎంగా ఉన్నప్పటికీ.. గొడ్డు మాంసం(బీఫ్) ఎగుమతులు ఆ రాష్ట్రం నుంచే అత్యధికంగా ఉన్నాయన్నారు. తిరుపతి లడ్డూ వివాదంపై శంకరాచార్య స్పందిస్తూ.. గొడ్డు కొవ్వు కలిగి ఉన్న ప్రసాదాన్ని కోట్లాదిమంది భక్తులకు పంచటం విచారకరమన్నారు. హిందువుల పవిత్రతను దెబ్బతీసే కుట్ర అని వ్యాఖ్యానించారు. దీనిపై వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలన్నారు.