Share News

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యత దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ కుట్ర

ABN , Publish Date - Nov 11 , 2024 | 03:49 AM

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను విడగొట్టి వారి రిజర్వేషన్లను లాక్కోవాలని కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యత దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ కుట్ర

  • ఆపై రిజర్వేషన్లు లాక్కోవాలని వ్యూహం: ప్రధాని మోదీ

గుమ్లా(ఝార్ఖండ్‌), ముంబై, నవంబరు 10: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను విడగొట్టి వారి రిజర్వేషన్లను లాక్కోవాలని కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కలిసుంటే పార్టీ మనుగడ కష్టమని కాంగ్రె్‌సకు తెలుసని, అందుకు వారిని విడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. స్వాత్రంత్యం వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యతకు కాంగ్రెస్‌ వ్యతిరేకంగానే ఉందని, వారి మధ్య ఐక్యత లేనంతవరకూ కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి దేశాన్ని దోచుకుందని ఆరోపించారు. ఈ మేరకు ఝార్ఖండ్‌లో పలుచోట్ల ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మాట్లాడారు. ఝార్ఖండ్‌లో కులాల మధ్య చిచ్చుపెట్టాలని కాంగ్రెస్‌- జేఎంఎం కూటమి యత్నిస్తోందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌- జేఎంఎం కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అధికారం చేజిక్కించుకోవడం కోసం వారు ఎంతవరకైనా వెళ్తారని అన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 03:50 AM