Share News

Rahul Gandhi: దోడా ఎన్‌కౌంటర్‌పై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 16 , 2024 | 02:49 PM

జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు భారత ఆర్మీ సైనికులు అశువులు బాయడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పదేపదే భద్రతా లోపాలు తలెత్తడానికి కేంద్ర బాధ్యత వహించాలని అన్నారు. దేశానికి, వీరసైనికులకు కీడు తలబెడుతున్న దుండగులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు.

Rahul Gandhi: దోడా ఎన్‌కౌంటర్‌పై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని దోడా (Doda) జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు భారత ఆర్మీ సైనికులు అశువులు బాయడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandi) కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పదేపదే భద్రతా లోపాలు తలెత్తడానికి కేంద్ర బాధ్యత వహించాలని అన్నారు. దేశానికి, వీరసైనికులకు కీడు తలబెడుతున్న దుండగులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు.


''జమ్మూకశ్మీర్‌లో ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అమరవీరులకు నా నివాళులు. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను. ఇలాంటి భయనక ఘటనలు ఒకదాని వెంట మరొకటి చోటుచేసుకోవడం బాధాకరం. అప్రహతిహతంగా సాగుతున్న ఈ దాడులు జమ్మూకశ్మీర్‌లోని దయనీయ పరిస్థితిని చాటుతున్నాయి. బీజేపీ తప్పుడు విధానాల వద్ద మన సైనికులు, వారి కుటుంబాల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి'' అని రాహుల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ట్వీట్ చేశారు. తరచు భద్రతా లోపాలు తలెత్తడానికి ప్రభుత్వం బాధ్యత వహించి, దేశానికి, సైనికులకు హాని తలబెడుతున్న వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి విషాదపూరిత సమయంలో యావద్దేశ ప్రజలు ఉగ్రవాదంపై పోరుకు దన్నుగా నిలబడాలని రాహుల్ సూచించారు.

Encounter With Terrorists: ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌లో నలుగురు భారత సైనికులు వీరమరణం


ఉగ్రవాదుల పిరికి చర్య: ఖర్గే

భరతమాత కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుల కుటుంబాలను తలుచుకుంటే గుండె తరుక్కుపోతుందని, క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. టెర్రరిస్టుల పిరికి పంద చర్యలు, హింసాత్మక ఘటనలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని చెప్పారు. 36 రోజులుగా వరుస ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకుంటున్నందున మన భదత్రా వ్యూహంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ప్రభుత్వం ప్రతీదీ బిజినెస్‌గా చూస్తుండటంతో పరిస్థితిలో మార్పు రావడం లేదని ఖర్గే ఆక్షేపించారు. భారత జాతీయ కాంగ్రెస్ మన వీర జవాన్లకు అండగా నిలుస్తుందని చెప్పారు.

For Latest News and National News click here

Updated Date - Jul 16 , 2024 | 04:42 PM