Share News

Supreme Court: న్యాయ వ్యవస్థపైనే ఆరోపణలా?

ABN , Publish Date - Sep 21 , 2024 | 05:30 AM

పశ్చిమ బెంగాల్‌లోని కోర్టుల్లో న్యాయ విచారణ సరిగ్గా జరగడం లేదంటూ సీబీఐ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Supreme Court: న్యాయ వ్యవస్థపైనే ఆరోపణలా?

  • సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: పశ్చిమ బెంగాల్‌లోని కోర్టుల్లో న్యాయ విచారణ సరిగ్గా జరగడం లేదంటూ సీబీఐ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్‌లో 2021 ఎన్నికల తర్వాత జరిగిన హింసకు సంబంధించిన కేసులను ఆ రాష్ట్రం వెలుపలకు బదిలీ చేయాలని సీబీఐ గతంలో వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిథాల్‌ల ధర్మాసనం తాజాగా విచారించింది. అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎ్‌సజీ) ఎస్వీ రాజును ఉద్దేశించి ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.


‘మిస్టర్‌ రాజు.. ఏం ఆధారాలున్నాయని బెంగాల్‌లోని అన్ని కోర్టుల్లోనూ ప్రతికూల వాతావరణం ఉందని చెబుతున్నారు.. మీ అధికారులు (సీబీఐ) ఆ రాష్ట్రాన్ని ఇష్టపడకపోవచ్చు అంతమాత్రాన అక్కడ న్యాయవ్యవస్థే సరిగ్గా పనిచేయడం లేదంటారా..? సీబీఐ లాంటి కేంద్ర సంస్థలు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. బెంగాల్‌ కేసులను బదిలీ చేస్తే కోర్టులే శత్రువులని ధ్రువీకరించినట్లవుతుంది. పిటిషన్‌ను ఉపసంహరించుకోండి..’ అని తేల్చి చెప్పింది. దీనిపై ఏఎ్‌సజీ స్పందిస్తూ.. పిటిషన్‌లో కొన్ని లోపాలున్నట్లు అంగీకరించారు. అలాగే కోర్టు అనుమతితో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

Updated Date - Sep 21 , 2024 | 05:30 AM