Delhi : ఖనిజాన్వేషణలో ప్రైవేటుకు పెద్దపీట
ABN , Publish Date - Aug 13 , 2024 | 03:56 AM
ఖనిజాల అన్వేషణ (ఎక్స్ప్లోరేషన్)లో ప్రైవేటు రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలోని అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో 6వ ఎన్ఎమ్ఈటీ(నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్) గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది.
6వ ఎన్ఎమ్ఈటీ గవర్నింగ్ బాడీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ఖనిజాల అన్వేషణ (ఎక్స్ప్లోరేషన్)లో ప్రైవేటు రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలోని అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో 6వ ఎన్ఎమ్ఈటీ(నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్) గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది.
ఎక్స్ అఫిషియో చైర్మన్ హోదాలో ఈ సమావేశానికి హాజరైన కిషన్రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఖనిజ సంపదకు లోటు లేదని, కానీ అనుకున్న స్థాయిలో ఫలితాలు సాధించలేక పోతున్నామని తెలిపారు.
అందుకే 2015లో ప్రధాని మోదీ ఎన్ఎమ్ఈటీని స్థాపించారని తెలిపారు. ఈ సంస్థ ద్వారా ఖనిజాల ఎక్స్ప్లోరేషన్లో పురోగతి సాధిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాల్లో ఎక్స్ప్లోరేషన్ ట్రస్టులను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. దీనికి కేంద్రం అన్ని విధాలా సహకారం అందిస్తుందన్నారు. గనుల విభాగంలో ఏఐ, ఆటోమేషన్, డ్రోన్ సాంకేతికతలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.