Share News

Vinesh Phogat: వినేశ్ ఫోగట్ నామినేషన్

ABN , Publish Date - Sep 11 , 2024 | 04:35 PM

రాజకీయాల్లోకి రావడం అదృష్టంగా భావిస్తున్నానని, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తాను పాటుపడతానని వినేశ్ ఫోగట్ తెలిపారు.

Vinesh Phogat: వినేశ్ ఫోగట్  నామినేషన్

ఛండీగఢ్: రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫోగట్ (Vinesh Phoga) హర్యానా (Haryana)లోని జులానా (Julana) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బుధవారంనాడు నామినేషన్ (Nomination) వేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ ఎస్ హుడా, ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం వినేశ్ ఫోగట్ మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రావడం అదృష్టంగా భావిస్తున్నానని, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తాను పాటుపడతానని తెలిపారు. జులానా ప్రజలు తనపై చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. శత్రువు బలహీనుడని ఎప్పుడూ అనుకోరాదని తాను రెజ్లింగ్‌ నుంచి నేర్చుకున్నానని, అదే స్ఫూర్తితో తాను రాజకీయాల్లోనూ కష్టపడతామని చెప్పారు. జులానా ప్రజలు తనపై చూపుతున్న ప్రేమ, ఆదరణకు ప్రతిగా వారి సంక్షేమానికి తాను పాటుపడతానని తెలిపారు.


వినేష్ ఫోగట్ గత ఆదివారంనాడు జులానా నియోజకవర్గంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రజల ఆశీర్వాదంతోనే తాను ఏ పోరాటంలోనైనా గెలుస్తానని భావిస్తానని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 5న జరుగనుండగా, అక్టోబర్ 8న ఫలితాలు వెలువడతాయి.


Read More Nationa News and Latest Telugu News

Amit Shah: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమిత్ షా ట్వీట్..

Updated Date - Sep 11 , 2024 | 04:44 PM