Share News

Vladimir Putin: హత్రాస్ దుర్ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆవేదన.. ఏమన్నారంటే

ABN , Publish Date - Jul 03 , 2024 | 06:18 PM

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో(Hatras) జరిగిన తొక్కిసలాటలో(Hathras Stampede) మృతి చెందిన వారి కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) సంతాపం తెలిపారు.

Vladimir Putin: హత్రాస్ దుర్ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆవేదన.. ఏమన్నారంటే

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో(Hatras) జరిగిన తొక్కిసలాటలో(Hathras Stampede) మృతి చెందిన వారి కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) సంతాపం తెలిపారు. ఈ వార్త తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పేర్కొన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీకి పంపిన సందేశంలో ఆయన ఈ ఘటనపై సంతాపం తెలియజేశారు. కాగా మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 120కి చేరింది.


త్వరలో రష్యాకు మోదీ!

ప్రధాని మోదీ వచ్చే వారం రష్యాలో పర్యటించనున్నారు. అయితే ఆయన పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని అధికారులు తెలిపారు. రష్యా పర్యటన జరిగితే దాదాపు 5 ఏళ్ల తరువాత మోదీ రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది. 2019లో మోదీ చివరిసారిగా ఫార్ ఈస్ట్ సిటీ వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఆర్థిక సమావేశానికి హాజరయ్యారు. రష్యాలో పర్యటిస్తున్న క్రమంలోనే ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ కలిపి భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య 21 వార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి.


ఘటనకు కారణమిదే..

యూపీలోని కిషన్‌గంజ్‌ జిల్లాకు చెందిన భోలే బాబా.. గతంలో పోలీసు శాఖ నిఘా విభాగంలో 18 ఏళ్లపాటు పనిచేసి, ఆ తర్వాత ఉద్యోగం మానేసి ఆధ్యాత్మిక గురువుగా మారారు. స్థానికులు ఆయనను ‘నారాయణ సాకార్‌ హరి’.. ‘సాకార్‌ విశ్వ హరి బాబా’ అనే పేర్లతో పిలుచుకుంటారు. ప్రతి మంగళవారం ఆయన నిర్వహించే సత్సంగానికి ప్రజలు వేలాదిగా హాజరవుతుంటారు. యూపీ నుంచే కాక.. హరియాణా, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు కూడా భోలేబాబా సత్సంగాలకు రావడం కద్దు. ఫేస్‌బుక్‌లోనే ఆయనకు 3 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.


ఈ క్రమంలోనే.. మంగళవారం హత్రా్‌సలో ఆయన నిర్వహించిన సత్సంగానికి ప్రజలు పెద్దఎత్తున వచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత.. బయటకు వెళ్లే సమయంలో తోపులాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లోపల వాతావరణమంతా ఉక్కగా ఉండడంతో అంతా త్వరగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారని.. కానీ ఆ ద్వారం చిన్నగా ఉండడంతో తొక్కిసలాట జరిగి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని వారు వివరించారు.

మరికొందరేమో..కార్యక్రమం చివర్లో భక్తులు భోలేబాబాను దగ్గర్నుంచీ చూడడానికి, ఆయన పాద ధూళిని తీసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఈ ఘోరం జరిగినట్టు చెబుతున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 03 , 2024 | 06:21 PM