Share News

Lok Sabha Polls: ఇండియా కూటమి సమావేశానికి దూరంగా మమత.. జూన్4 తర్వాత ఆమె ప్లాన్ ఇదేనా..?

ABN , Publish Date - May 28 , 2024 | 03:07 PM

దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. జూన్1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. జూన్4న ఓట్లు లెక్కిస్తారు. దీంతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. ఫలితాలకు మూడు రోజుల ముందు ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే పిలుపునిచ్చారు.

Lok Sabha Polls: ఇండియా కూటమి సమావేశానికి దూరంగా మమత.. జూన్4 తర్వాత ఆమె ప్లాన్ ఇదేనా..?
Mamata Banerjee

దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. జూన్1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. జూన్4న ఓట్లు లెక్కిస్తారు. దీంతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. ఫలితాలకు మూడు రోజుల ముందు ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి హాజరుకావడం లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. తుపాను కారణంగా సమావేశానికి హాజరుకావాడం లేదని ఆమె తెలిపారు. అయితే మమత వ్యూహం వెనుక అసలు కారణం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా కూటమికి బయటనుంచి మద్దతు ఇస్తానని ఇటీవల మమతా బెనర్జీ ప్రకటించారు. గతంలో ఇండియా కూటమి సమావేశానికి ఆమె హాజరయ్యారు. కానీ పశ్చిమబెంగాల్‌లో సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో బెంగాల్‌లో కాంగ్రెస్, టీఎంసీ వేర్వేరుగా పోటీచేస్తున్నాయి. మమతా బెనర్జీ వ్యవహారశైలి చూస్తుంటే మాత్రం ఆమె ఫలితాలు వచ్చేవరకు వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోంది. సమావేశానికి హాజరైతే.. ఆరోజు పీఎం అభ్యర్థిపై చర్చించే అవకాశం ఉంటుందని భావించిన మమత వ్యూహాత్మకంగానే సమావేశానికి హాజరుకాకుడదనే నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే చర్చ జరుగుతోంది.

PM Modi: ఎంత బురద జల్లితే కమలం అంత వికసిస్తుంది.. ప్రతిపక్షాలపై మోదీ పదునైన విమర్శలు


మోదీని కట్టడిచేసేందుకు..

వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ 30కి పైగా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలతో జట్టుకట్టింది. వీరంతా ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కూటమికి మమతా బెనర్జీ సూచించిన ఇండియా అలయన్స్‌గా పేరు పెట్టారు. సీట్ల పంపకానికి సంబంధించిన చర్చలు సఫలీకృతం కాకపోవడంతో బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని మమత ప్రకటించారు. అయినప్పటికీ ఇండియా కూటమికి మద్దుత విషయంలో ఆమె సానుకూల ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. మమతా బెనర్జీ పూర్తిగా సేఫ్ గేమ్‌ ఆడుతున్నారని రాజకీయ విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు.


జూన్1 సమావేశానికి దూరం వెనుక..

రెమాల్ తుపాన్ కారణంగా అమమతా బెనర్జీ జూన్1న తలపెట్టిన ఇండియా కూటమి సమావేశానికి హాజరుకావడం లేదని ప్రకటించారు. తుపాను నేపథ్యంలో తీసుకోవల్సిన చర్యల నేపథ్యంలో తాను సమావేశంలో పాల్గొనడం లేదని.. తన స్థానంలో పార్టీ నుంచి ప్రతినిధి హాజరవుతారని ఆమె ప్రకటించారు. కానీ దీనిలో పెద్ద వ్యూహామే దాగిఉందనే చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై ఏదైనా ప్రతిపాదన తీసుకొస్తే.. మమతా బెనర్జీ సమావేశంలో ఉంటే వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి వస్తుంది. అదే పార్టీ నుంచి ప్రతినిధి హాజరైతే ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోవల్సినప్పుడు పార్టీ అధినేత మమతతో మాట్లాడి తమ నిర్ణయం చెబుతామని చెప్పే అవకాశం ఉంటుంది. అలాగే టీఎంసీ నుంచి ఎవరూ హాజరుకాలేదనే విమర్శ రాకుండా ఉండేందుకు మమత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


పీఎం రేసులో ఉన్నారా..!

తాను ప్రధానమంత్రి రేసులో లేనని మమతా బెనర్జీ ప్రకటించినప్పటికీ.. ఆమె వ్యూహాలు చూస్తుంటే ప్రధాని పదవిపై ఆమె ఆశతో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ప్రాంతీయ పార్టీల్లో డీఎంకేతో పాటు గౌరవప్రధమైన సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్న పార్టీగా టీఎంసీ ఉంది. ఇండియా కూటమి అధికారం చేపట్టేందుకు టీఎంసీ మద్దతు అనివార్యమైతే ఆమె ప్రధానమంత్రి పదవికి పోటీపడవచ్చనే అభిప్రాయాన్ని కొందరు రాజకీయ పండితులు వ్యక్తం చేస్తున్నారు. మమతా ఆలోచన ఏమిటనేది జూన్4 ఫలితాల తర్వాత బయటపడే అవకాశం ఉంది.


Lok Sabha Elections: ఎన్నికల సమరం ఎవరి మధ్యనంటే... తేల్చిచెప్పిన యోగి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read more National News and Telugu News

Updated Date - May 28 , 2024 | 03:14 PM