Share News

Viral Video: టీచరమ్మా.. రీల్స్ కోసం ఇదేం పాడు పని.. మరీ ఇంత అవసరమా?

ABN , Publish Date - May 28 , 2024 | 05:45 PM

ఈరోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మోజులో పడి కొందరు చిత్ర విచిత్రమైన పనులకు పాల్పడుతున్నారు. తమ రీల్స్ వైరల్ అవ్వాలని.. లక్షల్లో వ్యూస్, లైక్స్ రావాలన్న ఉద్దేశంతో హద్దుమీరి..

Viral Video: టీచరమ్మా.. రీల్స్ కోసం ఇదేం పాడు పని.. మరీ ఇంత అవసరమా?
Bihar Teacher Makes Reel While Checking PPU Exams

ఈరోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) మోజులో పడి కొందరు చిత్ర విచిత్రమైన పనులకు పాల్పడుతున్నారు. తమ రీల్స్ వైరల్ అవ్వాలని.. లక్షల్లో వ్యూస్, లైక్స్ రావాలన్న ఉద్దేశంతో హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. చివరికి ప్రభుత్వ ఉద్యోగులు సైతం.. తమ విధులను మరచి వింత వింతగా వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ టీచర్ కూడా అలాంటి తప్పే చేయడంతో, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..


Read Also: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్.. భారీగా ప్రాణనష్టం

పీపీయూ (పాట్లిపుత్ర యూనివర్సిటీ) పరీక్షలను ఇవాల్యుయేషన్ చేసే సమయంలో.. బిహార్‌కు చెందిన ఒక టీచర్స్ రీల్స్ చేసింది. ఇలా చేయడమే పెద్ద తప్పయితే, అంతకుమించి మరో పెద్ద తప్పు ఆమె చేసింది. విద్యార్థులు రాసిన ఆన్సర్లను ఏమాత్రం గమనించకుండానే.. రైట్ మార్క్ వేస్తూ వెళ్లిపోయింది. ఓవైపు ఇతర టీచర్లు సరిగ్గా ఇవాల్యుయేట్ చేస్తూ తమ బాధ్యతలను నిర్వర్తిస్తుంటే.. ఈ టీచరమ్మా మాత్రం రీల్స్ కోసం పోజులు కొడుతూ, జవాబుల్ని గమనించకుండా రైట్ మార్క్ వేసుకుంటూ వెళ్లింది. ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. అవి వివాదాస్పదంగా మారాయి. ఈ రీల్స్‌పై నెటిజన్ల నుంచి తారాస్థాయిలో విమర్శలు వచ్చాయి.

Read Also: అనన్యా పాండేతో కలిసి రసెల్ ‘లుట్ పుట్ గయా’

ఓవైపు విద్యార్థులు ఎంతో కష్టపడి పరీక్షలు రాస్తే.. మరోవైపు ఈ టీచరమ్మా వాటిని సరిగ్గా ఇవాల్యుయేట్ చేయకుండా రీల్స్ చేస్తూ కూర్చోవడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి టీచర్ల వల్ల విద్యార్థుల భవిష్యత్తు తలక్రిందులవుతుందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు రంగంలోకి దిగి.. ఆమెపై చర్యలు తీసుకున్నారు. ఆ టీచరమ్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. రీల్స్ చేయడం తప్పు కాదు కానీ.. విధుల్లో ఉన్నప్పుడు ఇలాంటి పాడుపనులకు పాల్పడితే మాత్రం, పరిణామం ఇలాగే ఉంటుంది మరి!

Read Latest Viral News and Telugu News

Updated Date - May 28 , 2024 | 06:05 PM