Share News

Viral Video: ఇవెక్కడి తెలివితేటలురా బాబూ..! అకౌంట్ బ్యాలెన్స్ జీరో చూపించినా.. డబ్బులు ఎలా తీసుకున్నారో చూడండి..

ABN , Publish Date - Feb 18 , 2024 | 07:47 PM

ఏటీఎంలలో నగదు విత్‌డ్రా చేసే సమయంలో కొన్నిసార్లు చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు రావాల్సిన నగదు ఆగిపోతే.. మరికొన్నిసార్లు ఏటీఎం నుంచి అదనంగా నగదు బయటకు వస్తుంటుంది. ఇంకొన్నిసార్లు..

Viral Video: ఇవెక్కడి తెలివితేటలురా బాబూ..! అకౌంట్ బ్యాలెన్స్ జీరో చూపించినా.. డబ్బులు ఎలా తీసుకున్నారో చూడండి..

ఏటీఎంలలో నగదు విత్‌డ్రా చేసే సమయంలో కొన్నిసార్లు చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు రావాల్సిన నగదు ఆగిపోతే.. మరికొన్నిసార్లు ఏటీఎం నుంచి అదనంగా నగదు బయటకు వస్తుంటుంది. ఇంకొన్నిసార్లు చిరిగిపోయిన నోట్లు, నకిలీనోట్లు వస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో యువకుల నిర్వాకం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ జీరో చూపించినా.. డబ్బులు తీసుకున్న విధానం చూసి అంతా నవ్వుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు నగదు తీసుకునేందుకు ఏటీఎంకు (ATM) వెళ్తారు. అయితే నగదు విత్‌డ్రా (Cash Withdrawal) చేయాలని చూడగా.. బయటకు వచ్చిన స్లిప్‌లో బ్యాలెన్స్ జీరో అని చూపిస్తుంది. దీంతో వారికి ఓ విచిత్రమైన ఐడియా వస్తుంది. అయితే మళ్లీ మళ్లీ ఇలాగే బ్యాలెన్స్ చెక్ చేస్తారు. దీనివల్ల చాలా పేపర్ స్లిప్పులు వారి వద్ద జమ అవుతాయి.

Viral Video: పారాచ్యూట్ లేకుండానే కిందకు దూకేసిన వ్యక్తి.. మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు ఏమైందంటే..

చివరగా ఆ పేపర్ స్లిప్పులను తీసుకుని పాత పేపర్లు కొనే వ్యక్తికి ఇవ్వగా.. అతను వీరికి రూ.20లు ఇస్తాడు. ఆ డబ్బులతో వారు సంతోషంగా టీ తాగుతూ ఎంజాయ్ చేస్తారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఆ పేపర్ ముక్కలకు రూ.20లు ఎవరు ఇస్తారు’’.. అంటూ మరికొందరు, ‘‘కామెడీ స్కిట్ బాగుంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లి వేదికపై వధువు తుంటరి పనికి.. వరుడి వింత రియాక్షన్ చూసి.. అవాక్కైన అతిథులు..

Updated Date - Feb 18 , 2024 | 07:47 PM