Share News

Viral Video: వీడియో తీయాలని చూడగా ఫోన్ ఎత్తుకెళ్లిన నక్క.. కొద్దిదూరం వెళ్లాక అది చేసిన నిర్వాకం..

ABN , Publish Date - Feb 16 , 2024 | 04:05 PM

ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకూ సెల్ఫీ వీడియోలు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. కొందరు అందమైన ప్రదేశాలు కనపడగానే కెమెరాను క్లిక్‌మనిపిస్తే.. మరికొందరు...

Viral Video: వీడియో తీయాలని చూడగా ఫోన్ ఎత్తుకెళ్లిన నక్క.. కొద్దిదూరం వెళ్లాక అది చేసిన నిర్వాకం..

ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకూ సెల్ఫీ వీడియోలు తీసుకోవడం సర్వసాధారణమైపోయింది. కొందరు అందమైన ప్రదేశాలు కనపడగానే కెమెరాను క్లిక్‌మనిపిస్తే.. మరికొందరు పిల్లులు, కుక్కలు, కోతులు.. ఇలా కంటికి కనపించిన జంతువులు అన్నింటినీ తమ కెమెరాలో బంధింస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నక్కను వీడియో తీయాలని చూడగా.. అది ఏకంగా ఫోన్నే ఎత్తుకెళ్లింది. చివరకు ఏమైందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అడవిలో జంతువలును వీడియో తీసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడికి ఎదురుగా ఓ నక్క కనిపించింది. ఇంకేముందీ వెంటనే తన ఫోన్ తీసి, నేలపై ఉంచి కెమెరా ఆన్ చేసి పక్కకు వెళ్లాడు. అతన్ని మొదటి నుంచీ విచిత్రంగా గమనించిన నక్క.. తర్వాత ఫోన్ చూసి దగ్గరగా వచ్చింది. ఫోన్‌ను తేరిపారా చూసిన నక్క.. ఉన్నట్టండి (fox steals phone) ఫోన్‌ను నోట కరుచుకుని పారిపోయింది.

Dog Viral Video: ఈ కుక్క స్మార్ట్‌నెస్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. పెద్ద పేలుడును ఎలా ఆపేసిందంటే..

కొంత దూరం పరుగెత్తుకుంటూ వెళ్లి.. ఫోన్‌ను అటు, ఇటూ తిప్పి కింద పడేసి వెళ్లిపోయింది. ఈ సీన్ మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఈ నక్కకు స్మార్ట్ ఫోన్ అంటే ఇష్టం లేదేమో’’.. అంటూ కొందరు, ‘‘ఈ నక్క ఎక్స్‌ప్రెషన్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: పంటపొలాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. ఈ కుర్రాళ్ల తెలివితేటలు మామూలుగా లేవుగా..

Updated Date - Feb 16 , 2024 | 04:07 PM