Viral Video: ఇది అలాంటి ఇలాంటి కోతి కాదు.. కారు ఆపి మరీ బిస్కట్లు ఇస్తే.. అది చేసిన నిర్వాకం చూడండి..
ABN , Publish Date - Feb 14 , 2024 | 05:51 PM
కుక్కలు, పిల్లులు, కోతులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనుషుల్లా ప్రవర్తిస్తూ ఆశ్చర్యపరిస్తే.. మరికొన్నిసార్లు ఏకంగా మనుషులనే భయపెడుతుంటాయి. ఇంకొన్నిసార్లు ...
కుక్కలు, పిల్లులు, కోతులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనుషుల్లా ప్రవర్తిస్తూ ఆశ్చర్యపరిస్తే.. మరికొన్నిసార్లు ఏకంగా మనుషులనే భయపెడుతుంటాయి. ఇంకొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా ప్రవర్తిస్తూ అందరికీ షాక్ ఇస్తుంటాయి. ఇలాంటి జంతువులకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ కోతి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కారు ఆపి మరీ కోతికి బిస్కట్లు ఇవ్వబోయాడు. అయితే చివరకు అది చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అయ్యారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు కారులో అటవీ ప్రాంతంలోని మార్గంలో వెళ్తుంటారు. కొంచెం దూరం వెళ్లగానే వారికి కొన్ని కోతులు కనిపిస్తాయి. వాటికి ఏమైనా ఆహారం ఇద్దామనే ఉద్దేశంతో కారు ఆపి మరీ.. (Tourists giving biscuits to monkey) కోతికి బిస్కట్లు ఇవ్వబోతారు. కారు సమీపానికి వచ్చిన కోతి.. అతను ఇచ్చిన బిస్కట్ వైపు కొద్ది సేపు చూసి.. ‘‘నాకు ఇలా ఒకటి రెండు సరిపోవు.. నీ దగ్గర ఉన్న మొత్తం బిస్కట్లు కావాలి’’.. అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెంటనే కారు డోరు మీదకు జంప్ చేస్తుంది.
Optical illusion: ఈ చెట్ల మధ్యన దాక్కున్న.. మూడు గుడ్లగూబలను కనిపెట్టడం మీ వల్ల అవుతుందా..?
స్టీరింగ్ కింద వైపు బాక్సు తెరచి, అందులో ఉన్న బిస్కట్ ప్యాకెట్లను మొత్తం తీసుకుంటుంది. ‘‘ఈ పూటకు సరిపడా ఫుడ్ దొరికిందోచ్’’.. అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కారులో ఉన్న వారు కోతి నిర్వాకం చూసి అవాక్కవుతారు. అది బిస్కట్లు తీసుకున్నంత సేపూ అలాగే చూస్తుండిపోతారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కోతికి లాక్కోవడం తప్ప.. తీసుకోవడం అలవాటు లేదేమో’’.. అంటూ కొందరు, ‘‘ఈ కోతి దారి దోపిడీ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 69 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Valentine's Day: కళాశాల ఆవరణలో కలుసుకున్న ప్రేమికులు.. ప్రేయసికి విషెస్ చెబుతాడనుకుంటే.. చివరకు..