Share News

Viral Video: మానవాళికి కనువిప్పు కలిగించిన పులి.. ఇంతకీ అది చేసిన పనేంటో మీరే చూడండి..

ABN , Publish Date - Feb 14 , 2024 | 08:38 PM

రోజురోజుకూ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా.. మనుషుల ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పూ రావడం లేదు. ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా..

Viral Video: మానవాళికి కనువిప్పు కలిగించిన పులి.. ఇంతకీ అది చేసిన పనేంటో మీరే చూడండి..

రోజురోజుకూ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా.. మనుషుల ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పూ రావడం లేదు. ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా పర్యావరణానికి హాని తలపెడుతున్నారు. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు జంతువులు పలు సందేశాలు ఇస్తుంటాయి. తమను చూసి నేర్చుకోండి.. అన్నట్లుగా ఆశ్చర్యకర పనులు చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ పులికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణానికి భిన్నంగా ఓ పులి చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా పులులు, సింహాలు అనగానే.. కనిపించిన జంతువులు, మనుషులపై దాడి చేయడం మాత్రమే కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. కొన్నిసార్లు ఇవి కూడా అంతా ఆశ్చర్యపోయే పనులు చేస్తుంటాయి. తాజాగా, ఓ పులి ఇలాంటి పనే చేసింది. జంతువులను వేటాడాల్సిన ఓ పులి.. విచిత్రమైన పని చేసి, తద్వారా మారవాళికి సరికొత్త సందేశం ఇచ్చింది. పులి నీళ్ల వద్దకు వెళ్లడం చూసి అంతా దాహం తీర్చుకోవడానికేమో అని అనుకున్నారు. అయితే తీరా ఆ పులి అక్కడికి వెళ్లి నీటిలోకి తల పెట్టి... అక్కడే తేలియాడుతున్న ప్లాస్టిక్ బాటిల్‌ను నోట కురుచుకుంటుంది.

Photo Puzzle: ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో 5 తేడాలు ఉన్నాయి. అవేంటో 60 సెకన్లలో గుర్తిస్తే మీకు తిరుగులేనట్లే..

ప్లాస్టిక్ బాటిల్‌ను నోట కరుచుకుని (tiger picks up plastic waste) అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లి పడేస్తుంది. వేటాడాల్సిన పులి.. అందుకు పూర్తి విరుద్ధంగా ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎత్తేయడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరే! ఈ పులి చాలా విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఈ పులిని చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 93వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇది అలాంటి ఇలాంటి కోతి కాదు.. కారు ఆపి మరీ బిస్కట్లు ఇస్తే.. అది చేసిన నిర్వాకం చూడండి..

Updated Date - Feb 14 , 2024 | 08:38 PM