Share News

Viral Video: చుట్టూ గుంపులుగా సింహాలు.. మధ్యలో ఒకే ఒక్క గేదె.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - May 22 , 2024 | 05:07 PM

ఒక సింహం ఎదురుపడితేనే ఎదురుగా ఎలాంటి జంతువూ కనపడదు. అలాంటిది పదుల సంఖ్యలో సింహాలను ఒక్కసారిగా చూస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సమయంలో ఎలాంటి జంతువున్నా.. వాటికి ఆహారమవ్వాల్సిందే. అయితే..

Viral Video: చుట్టూ గుంపులుగా సింహాలు.. మధ్యలో ఒకే ఒక్క గేదె.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ఒక సింహం ఎదురుపడితేనే ఎదురుగా ఎలాంటి జంతువూ కనపడదు. అలాంటిది పదుల సంఖ్యలో సింహాలను ఒక్కసారిగా చూస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సమయంలో ఎలాంటి జంతువున్నా.. వాటికి ఆహారమవ్వాల్సిందే. అయితే అన్ని సమయాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంటుందా అంటే సందేహమే. ఎందుకంటే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. సింహాల గుంపు ఒక గేదెను చుట్టుముట్టాయి. దాడి చేసి చంపేసే సమయంలో చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పదుల సంఖ్యలో సింహాలు.. ఆహారం కోసం వెతుకుతుంటాయి. ఈ క్రమంలో వాటికి ఒంటరిగా ఉన్న గేదె కనిపిస్తుంది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సింహాలన్నీ గేదెను చుట్టుముడతాయి. వాటిని చూడగానే గేదె.. భయంతో కంగారుపడిపోతుంది. ఎలాగైనా సింహాల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతలో సింహాలన్నీ దానిపై ఒక్కొక్కటిగా (Lion attack on buffalo) దాడిగి దిగుతాయి. అయితే దాడి చేయాలని చూసిన ప్రతిసారీ.. దున్నపోతు వాటిని వెనుక కాళ్లతో బలంగా తన్నుతూ దూరంగా నెట్టేస్తుంది. దాని కాళ్ల దెబ్బకు సింహాలు కూడా భయంతో వెనక్కు తగ్గుతాయి.

Viral Video: దండ వేస్తుండగా వధువు షాకింగ్ రియాక్షన్.. భయంతో వణికిపోయిన వరుడు.. చివరకు..


ఈ క్రమంలో అక్కడి నుంచి పరుగందుకుని.. సమీపంలో ఉన్న గేదెల మందలో కలిసిపోతుంది. దాన్ని వెంటాడుతూ వెళ్లిన సింహాలు.. గేదెల మందను చూసి షాక్ అవుతాయి. తమ సహచరుడిపై దాడి చేయడం చూసి ఆగ్రహానికి గురైన గేదెలన్నీ.. సింహాల పైకి దూసుకొస్తాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సింహాల గుంపు తోక ముడిచి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాగా, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘గేదె కాలి పంచ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘సింహాలకు చుక్కలు చూపించిన గేదె’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరుర కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌‌లో విచిత్ర ఘటన.. నిద్ర లేచిన దంపతులు.. సీట్ల కింద పరిశీలించగా..

Updated Date - May 22 , 2024 | 05:07 PM