Share News

Viral Video: మహిళను చూడగానే పరుగెత్తుకొచ్చిన సింహాలు.. చివరకు జరిగింది చూస్తే..

ABN , Publish Date - May 22 , 2024 | 04:12 PM

సింహాలను చూడడం పక్కనపెడితే.. వాటి పేరు వింటేనే భయం మొదలవుతుంది. ఇక పొరపాటున అవి ఎదురుపడితే మాత్రం.. ప్రాణాలు పోయినంత పనవుతుంది. అయితే ఇంతటి ప్రమాదకరమైన పులులు, సింహాలతో కూడా కొందరు పరాచకాలు ఆడుతుంటారు. ఈ సమయంలో..

Viral Video: మహిళను చూడగానే పరుగెత్తుకొచ్చిన సింహాలు.. చివరకు జరిగింది చూస్తే..

సింహాలను చూడడం పక్కనపెడితే.. వాటి పేరు వింటేనే భయం మొదలవుతుంది. ఇక పొరపాటున అవి ఎదురుపడితే మాత్రం.. ప్రాణాలు పోయినంత పనవుతుంది. అయితే ఇంతటి ప్రమాదకరమైన పులులు, సింహాలతో కూడా కొందరు పరాచకాలు ఆడుతుంటారు. ఈ సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుంటుంటాయి. అలాగే మరికొందరు వీటితో స్నేహం కూడా చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మహిళను చూడగానే రెండు సింహాలు పరుగెత్తుకుంటూ దగ్గరికి వచ్చాయి. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జూలోని సింహాల ఎన్‌క్లోజర్ (Lion enclosure) వద్దకు ఓ మహిళ వెళ్తుంది. కంచె వద్దకు వెళ్లి నిలబడగానే.. దూరంలో ఉన్న సింహాలు ఆమెను గమనిస్తాయి. ఆ వెంటనే పరుగుపరుగున ఆమె వద్దకు వచ్చేస్తాయి. ఈ సీన్ చూసి.. ఆగ్రహంతో ఆమెపై దాడి చేస్తాయేమో అని అంతా భయపడిపోతారు. అయితే అందుకు విరుద్ధంగా సింహాలు.. ఆమెను (Lions hugging woman) ప్రేమగా కౌగిలించుకుంటాయి. చూసేందుకు అచ్చం చిన్న పిల్లలు తల్లిని కౌగింలించుకున్న తరహాలోనే ఆమెపై ప్రేమను కురిపిస్తాయి.

Viral Video: దండ వేస్తుండగా వధువు షాకింగ్ రియాక్షన్.. భయంతో వణికిపోయిన వరుడు.. చివరకు..


ఆమె కూడా వాటిని చిన్న పిల్లల తరహాలోనే దగ్గరికి తీసుకుని తలపై చేతులు పెట్టి ప్రేమగా నిమురుతుంది. మధ్య మధ్యలో సింహాలు ఆమె మొఖంపై ముద్దులు పెడుతూ అంతా అవాక్కయ్యేలా చేస్తాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చిన్నపిల్లల్లా మారిపోయిన సింహాలు’’.. అంటూ కొందరు, ‘‘తల్లీ పిల్లలు కౌగింలించుకున్నట్లుగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌‌లో విచిత్ర ఘటన.. నిద్ర లేచిన దంపతులు.. సీట్ల కింద పరిశీలించగా..

Updated Date - May 22 , 2024 | 04:12 PM