Share News

Viral Video: ఎద్దు విన్యాసాలు ఎప్పుడైనా చూశారా.. మేడపై నుంచి ఒక్కసారిగా..

ABN , Publish Date - Jul 28 , 2024 | 06:48 PM

జంతువులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటం. అలాగే మరికొన్నిసార్లు కొన్ని జంతువులు వివిధ రకాల విన్యాసాలు కూడా చేస్తుంటాయి. మేడపై నుంచి కిందకు దూకిన కుక్కను చూశాం, విచిత్ర విన్యాసాలు చేసిన పందులను కూడా చూశాం. ఇలాంటి..

Viral Video: ఎద్దు విన్యాసాలు ఎప్పుడైనా చూశారా.. మేడపై నుంచి ఒక్కసారిగా..

జంతువులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటం. అలాగే మరికొన్నిసార్లు కొన్ని జంతువులు వివిధ రకాల విన్యాసాలు కూడా చేస్తుంటాయి. మేడపై నుంచి కిందకు దూకిన కుక్కను చూశాం, విచిత్ర విన్యాసాలు చేసిన పందులను కూడా చూశాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ఎద్దుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మేడపై నుంచి కిందకు దూకిన ఎద్దును చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఎద్దు అటు తిరిగి ఇటు తిరిగి చివరకు నిర్మాణంలో ఉన్న ఓ మేడ పైకి ఎక్కింది. కాసేపటి తర్వాత కిందకు ఎలా దిగాలో అర్థం కాక అటూ, ఇటూ తిరుగుతూ ఉంది. అయితే చివరకు మొదటి అంతస్థు చివర అంచు వద్దకు వచ్చి నిల్చుంది.

Viral Video: రోడ్డుపైనే ప్రేమికుల సరసాలు.. ప్రేయసిని పక్కకు ఎత్తుకెళ్తుండగా.. చూస్తుండగానే ఒక్కసారిగా..


చూస్తుండగానే మొదటి అంతస్థు నుంచి ఒక్కసారిగా (bull jumped from first floor of building) కిందకు దూకేసింది. ధబేల్‌మని కింద పడడంతో పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో అక్కడ పని చేస్తున్న వారంతా షాక్ అయ్యారు. కింద పడ్డ ఎద్దు కాసేపు అలాగే ఉండి.. తర్వాత పైకి లేచి తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఎరను చూసి దగ్గరికొచ్చిన మొసలి.. సడన్‌గా వెనక్కు లాక్కోవడంతో.. చివరకు తిక్కరేగి..


ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దేవుడు ఈ ఎద్దును కాపాడాడు’’.., ‘‘ఎవరైనా ఎద్దును తరిమిఉంటారు.. అందుకే ఇలా భయంతో దూకేసినట్లుంది’’.., ‘‘వామ్మో.. చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’’.., ‘‘దేవుడు ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పిల్లల డాన్స్‌కు ఫిదా అయిన పావురం.. చివరకు ఏం చేసిందో చూడండి..

Updated Date - Jul 28 , 2024 | 06:48 PM