Share News

Viral Video: చిన్న పిల్లాడిలా మారిన ఎలుక.. వంటింట్లో అది చేస్తున్న నిర్వాకం చూడండి..

ABN , Publish Date - Jul 26 , 2024 | 09:39 PM

ఎలుకల బెడద ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో ఏమూల ఎలాంటి తినుబండారాలు దాచుకున్నా వదలకుండా తినేస్తుంటాయి. అంతటితో ఆగకుండా దుస్తులు, పుస్తకాలు తదితరాలను కూడా కొరికేస్తూ కోపం తెప్పిస్తుంటాయి. కొన్నిసార్లు ..

Viral Video: చిన్న పిల్లాడిలా మారిన ఎలుక.. వంటింట్లో అది చేస్తున్న నిర్వాకం చూడండి..

ఎలుకల బెడద ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో ఏమూల ఎలాంటి తినుబండారాలు దాచుకున్నా వదలకుండా తినేస్తుంటాయి. అంతటితో ఆగకుండా దుస్తులు, పుస్తకాలు తదితరాలను కూడా కొరికేస్తూ కోపం తెప్పిస్తుంటాయి. కొన్నిసార్లు ఇళ్లల్లో దాచుకున్న కరెన్నీ నోట్లను ముక్కలు ముక్కలు చేసి అందరికీ షాక్ ఇస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ఎలుక వీడియో చూసి అంతా అవాక్కవుతన్నారు. చిన్న పిల్లల తరహాలో వంటింట్లో ఎలుక చేసిన పని చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇంట్లోకి దూరిన ఎలుక.. చివరకు వంటింట్లోకి చేరుతుంది. తినుబండారాల కోసం అటూ ఇటూ చూసినా దానికి ఎలాంటి ఆహారం దొరకనట్లుంది. దీంతో చివరకు చిన్న పిల్లాడు అల్లరి చేసినట్లుగా ఈ ఎలుక కూడా ఇంట్లో గోలగోల చేస్తుంది. వంటింట్లోని (rat picked up glass in kitchen) గ్లాసును నోటితో పట్టుకుని కిందకు తెస్తుంది.

Viral Video: రైలును ఆపేందుకు పట్టాలపై ఎదురుగా వెళ్లి ముద్దులు పెట్టాడు.. ఇంజిన్‌ను ఆపిన డ్రైవర్.. ఆ వెంటనే..


ఆ ఎలుక అంతటితో ఆగకుండా ఆ గ్లాసుతో ఇళ్లంతా తిరుగుతుంది. మధ్య మధ్యలో గ్లాసును నేలకేసి కొడుతూ శబ్ధాలు చేస్తూ హంగామా సృష్టిస్తుంది. ఇలా ఆ ఎలుక చాలా సేపు గ్లాసును నోటితో పట్టుకుని, నేలకు కొడుతూ ఇల్లు మొత్తం చుట్టేస్తుంది. ‘‘ఆకలేస్తోందీ.. నాకు అర్జంట్‌గా ఏదైనా పెట్టండి’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ గ్లాసుతో సౌండ్ చేస్తుంటుంది. ఈ ఘటనను మొత్తం ఇంటి యజమానికి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Viral Video: వైట్ కోబ్రా పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. పామును లోపలికి వదలడంతో.. చూస్తుండగానే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఎలుక అల్లరి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘రాత్రి వేళల్లో ఇలా చేస్తే గుండెపోటు వస్తుంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇది ఎలుక కాదు.. సామాన్లు ఎత్తుకెళ్లే దొంగ’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అనవసరంగా కోతితో పెట్టుకుందే.. చివరకు పులి పరిస్థితి చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Jul 26 , 2024 | 09:47 PM