Share News

Viral Video: వైట్ కోబ్రా పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. పామును లోపలికి వదలడంతో.. చూస్తుండగానే..

ABN , Publish Date - Jul 25 , 2024 | 08:14 PM

భూమిపై చాలా రకాల పాములు ఉన్న విషయం తెలిసిందే. అయితే వాటిలో కొన్ని పాములు మాత్రమే ప్రమాదకరమైనవి. ఇలాంటి ప్రమాదకరమైన పాముల్లోనూ కొన్ని అంత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. ఇలాంటి..

Viral Video: వైట్ కోబ్రా పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. పామును లోపలికి వదలడంతో.. చూస్తుండగానే..

భూమిపై చాలా రకాల పాములు ఉన్న విషయం తెలిసిందే. అయితే వాటిలో కొన్ని పాములు మాత్రమే ప్రమాదకరమైనవి. ఇలాంటి ప్రమాదకరమైన పాముల్లోనూ కొన్ని అంత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, వైట్ కోబ్రాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వైట్ కోబ్రా సమీపానికి ఓ పామును వదలడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అరుదుగా కనిపించే ల్యుసిస్టిక్ కింగ్ కోబ్రా అనే పాము నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. ఓ వ్యక్తి వైట్ కోబ్రా పవర్ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశాడు. బాక్సులో సిద్ధంగా ఉంచుకున్న బైట్ కోబ్రా పాము వద్దకు ఓ నల్లటి పామును వదులుతాడు.

Viral Video: ఇది లిఫ్ట్ గదా.. లేక శవపేటికా.. అవాక్కవుతున్న నెటిజన్లు..


పాము సమీపానికి రాగానే.. వైట్ కోబ్రా దాన్ని వాసన చూస్తుంది. చివరకు వెంటనే (white cobra bit a snake) నోటితో పట్టుకుంటుంది. గట్టిగా పట్టుకుని అలాగే ఉండిపోతుంది. దాన్నుంచి తప్పించుకోవడానికి ఆ పాము ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఈ క్రమంలో వైట్ కోబ్రా తలపై చేయి పెట్టి నిమిరిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత అద్దాల డోరును మూసేస్తాడు.

Viral Video: పెళ్లి వేదికపై వరుడి పక్కనే వధువు ఏడుపు.. ఓదార్చిన స్నేహితులు.. కారణమేంటని విచారించగా..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘వామ్మో.. వైట్ కోబ్రా పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘వైట్ కోబ్రాను ఇంట్లో పెట్టుకున్నావ్.. జాగ్రత్త’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: క్వార్టర్ కొడితే ఇలాగే ఉంటుందేమో.. పాముతోనే ఫన్నీ గేమ్స్.. చివరకు జరిగింది చూస్తే..

Updated Date - Jul 25 , 2024 | 08:14 PM