Share News

Viral Video: ఇది లిఫ్ట్ గదా.. లేక శవపేటికా.. అవాక్కవుతున్న నెటిజన్లు..

ABN , Publish Date - Jul 24 , 2024 | 07:59 PM

పెద్ద పెద్ద భవంతులు, అపార్ట్‌మెంట్లలో మెట్లతో పాటూ విధిగా లిఫ్ట్ ఉండడం సర్వసాధారణం. అయితే లిఫ్ట్ గదులను చాలా మంది వివిధ రకాలుగా డిజైన్ చేస్తుంటారు. ఎక్కువ మందిని తరలించేలా కొందరు కొత్త రకం లిఫ్ట్‌లను అందుబాటులోకి తేవడం చూస్తుంటాం. ప్రపంచంలోనే...

Viral Video: ఇది లిఫ్ట్ గదా.. లేక శవపేటికా.. అవాక్కవుతున్న నెటిజన్లు..

పెద్ద పెద్ద భవంతులు, అపార్ట్‌మెంట్లలో మెట్లతో పాటూ విధిగా లిఫ్ట్ ఉండడం సర్వసాధారణం. అయితే లిఫ్ట్ గదులను చాలా మంది వివిధ రకాలుగా డిజైన్ చేస్తుంటారు. ఎక్కువ మందిని తరలించేలా కొందరు కొత్త రకం లిఫ్ట్‌లను అందుబాటులోకి తేవడం చూస్తుంటాం. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్‌ను ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో ఏకంగా 200 మందికి పైగా ప్రయాణించే వెలుసుబాటును కల్పించారు. ఇదిలావుండగా, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో లిఫ్ట్ గదిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇది లిఫ్ట్ గదా.. లేక శవపేటికా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అపార్ట్‌మెంట్‌లో అరుదైన లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. లిఫ్ట్ డోరు తెరుచుకోగానే అందులోని స్థలం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ లిఫ్ట్‌లో కేవలం (Small lift room) ఒకే ఒక్క మనిషి మాత్రమే నిలబడే వీలుంది. అంతకు మించి ఒక్క బ్యాగ్ పెట్టుకోవడానికి కూడా స్థలం లేదు.

Viral Video: లిఫ్ట్‌లో షాకింగ్ అనుభవం.. డోరు తెరుచుకున్నా దిగలేక అవస్థలు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఒక్క మనిషి కూడా మరీ లావుగా ఉన్న వారైతే ఇందులో వెళ్లడం చాలా కష్టం. సన్నగా ఉన్న ఓ యువతి లిఫ్ట్‌లో ప్రయాణించి.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లిఫ్ట్ డోరు లోపలికి వెళ్లిన ఆమె.. బటన్ నొక్కగానే డోరు మూసుకుపోయింది. అటూ ఇటూ కదలడానికి కూడా అందులో స్థలం లేదు. అరుదైన ఈ లిఫ్ట్‌ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: అయ్యో పాపం.. పాము నుంచి పిల్లలను కాపాడుకునేందుకు ఈ తల్లి పక్షి తపన చూస్తే..


ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది లిఫ్టా.. లేక శవపేటికా’’.., ‘‘సడన్‌గా పవర్ ఆఫ్ అయితే పరిస్థితి ఏంటీ’’.., ‘‘ఈ లిఫ్ట్ గది పాడైతే.. శవపేటికలా వాడుకోవచ్చు’’.., ‘‘ఈ వీడియో చూసి ఊపిరి తీసుకోలేకున్నాం’’.., ‘‘ఇందులో ఇరుక్కుపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి’’.. అంటూ ఇలా కొందరు కామెంట్లు చేస్తుండగా.. వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 34వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లి వేదికపై వరుడి పక్కనే వధువు ఏడుపు.. ఓదార్చిన స్నేహితులు.. కారణమేంటని విచారించగా..

Updated Date - Jul 24 , 2024 | 07:59 PM