Share News

Viral Video: అయ్యో.. ఈ జింక బాధ వర్ణణాతీతం.. జన్మనిచ్చిన పిల్లను చూసుకునేలోపే.. ఉన్నట్టుండి..

ABN , Publish Date - Jul 23 , 2024 | 09:24 PM

జంతువుల మధ్య కొన్నిసార్లు సరదా ఘటనలు చోటు చేసుకుంటే.. మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఇంకొన్నిసార్లు హృదయ విదారక ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ప్రధానంగా ..

Viral Video: అయ్యో.. ఈ జింక బాధ వర్ణణాతీతం.. జన్మనిచ్చిన పిల్లను చూసుకునేలోపే.. ఉన్నట్టుండి..

జంతువుల మధ్య కొన్నిసార్లు సరదా ఘటనలు చోటు చేసుకుంటే.. మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. ఇంకొన్నిసార్లు హృదయ విదారక ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ప్రధానంగా ఆహార వేటలో భాగంగా ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తేనే ఉంటాం. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ జింకకు ఏతల్లికీ రాని కష్టం వచ్చింది. జన్మనిచ్చిన పిల్లను చూసుకునేలోపే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కడుపుతో ఉన్న ఓ జింక పిల్లకు (deer giving birth to cub) జన్మనిస్తుంటుంది. జింక పిల్ల జన్మించగానే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. అప్పుడే పుట్టిన జింకను వెనక్కు తిరిగి చూసుకునే లోపే.. ఓ పెద్ద పులి అక్కడికి వచ్చింంది. దాన్ని చూసిన జింక భయంతో అక్కడి నుంచి పక్కకు పారిపోయింది. జింక పిల్ల వద్దకు (Tiger attack on baby deer) వచ్చిన పులి.. దానిని వాసన చూస్తూ పదే పదే తదేకంగా గమనిస్తుంది.

Viral Video: ఇలాంటి బస్సులు కూడా ఉన్నాయా.. కిటికీ నుంచి ఎక్కుతుండగా.. ఒక్కసారిగా..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. అయితే ఈ ఘటనను చూస్తుంటే పులి ఆ జింక పిల్లను చంపేసినట్లే అనిపిస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భావేద్వేగంతో కూడిన కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో.. వీడియో చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోంది’’.., ‘‘వీడియో తీస్తున్నవారు శబ్ధాలు చేసి పులిని తిరిమికొట్టవచ్చుగా’’.., ‘‘ఈ జింకకు ఎంత కష్టం వచ్చింది పాపం’’.. అంటూ ఇలా కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు బాధాకరమైన ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 32వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: వివాహమైన మూడు నిముషాల్లోనే విడాకులు.. కారణం తెలిస్తే.. ఖంగుతింటారు..

Updated Date - Jul 23 , 2024 | 09:24 PM