Share News

Viral Video: ఇలాంటి బస్సులు కూడా ఉన్నాయా.. కిటికీ నుంచి ఎక్కుతుండగా.. ఒక్కసారిగా..

ABN , Publish Date - Jul 23 , 2024 | 05:08 PM

రైలు, బస్సు ప్రయాణాల్లో సీటు కోసం ప్రయాణికులు పడే అవస్థలు రోజూ చూస్తూనే ఉంటాం. ఎలాగైనా సీటు సంపాదించాలనే ఆతృతలో వినూత్న విన్యాసాలు చేస్తుంటారు. ఒకరినొకరు తోసుకుంటూ కొన్నిసార్లు, కిటికీల నుంచి..

Viral Video: ఇలాంటి బస్సులు కూడా ఉన్నాయా.. కిటికీ నుంచి ఎక్కుతుండగా.. ఒక్కసారిగా..

రైలు, బస్సు ప్రయాణాల్లో సీటు కోసం ప్రయాణికులు పడే అవస్థలు రోజూ చూస్తూనే ఉంటాం. ఎలాగైనా సీటు సంపాదించాలనే ఆతృతలో వినూత్న విన్యాసాలు చేస్తుంటారు. ఒకరినొకరు తోసుకుంటూ కొన్నిసార్లు, కిటికీల నుంచి లోపలికి దూరి మరికొన్నిసార్లు సీటు కోసం పాట్లు పడుతుంటారు. ఈ క్రమంలో కొందరు ఎట్టకేలకు సీటు పొందితే.. ఇంకొందరికి షాకింగ్ ఘటనలు ఎదురవుతుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బస్సులో సీటు కోసం ఓ విద్యార్థి కిటికీలో నుంచి లోపలికి దూరేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో చివరకు షాకింగ్ ఘటన చోట చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలో (Maharashtra) జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ విద్యార్థి ఇంటికి వెళ్లే క్రమంలో బస్సు కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలో అక్కడికి ఓ బస్సు వచ్చి ఆగింది. అయితే ఆ బస్సు కోసం అప్పటికే చాలా మంది ఎదురుచూస్తుండడంతో అందరికీ సీటు దొరకడం కష్టంగా మారింది. ఈ క్రమంలో సదరు విద్యార్థి ఎలాగైనా సీటు సంపాదించాలనే ఉద్దేశంతో బస్సు మధ్యలోకి వెళ్లి తన బ్యాగును కిటికీలో నుంచి లోపలికి విసిరేశాడు.

Viral Video: తలుపుచాటుకు వెళ్లిన బల్లి.. తరిమికొట్టాలని స్ప్రేతో వెళ్లిన యువతి.. తీరా చూస్తే షాకింగ్ సీన్..


ఆ తర్వాత తానూ కిటికీలో నుంచి బస్సులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ముందుగా కిటికీని రెండు చేతులతో పట్టుకుని కాళ్లు లోపలికి పెట్టాడు. ఆ తర్వాత కిటికీపై అంచు పట్టుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలో ఈ క్రమంలో కిటికీ మొత్తం ఊడిపోయింది. దీంతో కిటికీతో పాటూ అతను(student falling from bus window) కూడా ధబేల్‌మని కిందపడ్డాడు. ఈ ఘటనతో అక్కడున్న విద్యార్థులంతా షాక్ అయ్యారు. కింద ఉన్న కొందరు పరుగుపరుగున అక్కడికి వెళ్లి విద్యార్థిని పైకి లేపారు.

Viral Video: ఒక ఏసీతో రెండు అంతస్తుల్లో కూలింగ్.. ఇతడి టెక్నిక్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఈ ఘటనలో అతడికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. బస్సు పాతది కావడంతో కిటికీలు కూడా దెబ్బతిన్నాయి. దీంతోనే ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరే.. ఇదేంట్రా బాబోయ్.. ఈ బస్సు మరీ దారుణంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి బస్సులను సీజ్ చేయాలి’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి సాహసాలు ఎవరూ చేయొద్దు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: జాతరలో రద్దీ జనం మధ్య జంట విచిత్ర నిర్వాకం.. ముద్దులు పెట్టుకుంటూ..

Updated Date - Jul 23 , 2024 | 05:08 PM