Share News

Viral Video: సీన్ రివర్స్ అంటే ఇదేనేమో.. గేదెలను చూసి పారిపోయిన సింహం.. చివరకు..

ABN , Publish Date - Jul 20 , 2024 | 08:58 PM

సింహం అంటేనే ధైర్యానికి ప్రతీకగా చూస్తుంటాం. బతికితే సింహంలా బతకాలని కూడా అంటుంటాం. అయితే అంత గొప్ప సింహానికి కూడా కొన్నిసార్లు గడ్డు పరిస్థితులు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు...

Viral Video: సీన్ రివర్స్ అంటే ఇదేనేమో.. గేదెలను చూసి పారిపోయిన సింహం.. చివరకు..

సింహం అంటేనే ధైర్యానికి ప్రతీకగా చూస్తుంటాం. బతికితే సింహంలా బతకాలని కూడా అంటుంటాం. అయితే అంత గొప్ప సింహానికి కూడా కొన్నిసార్లు గడ్డు పరిస్థితులు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు చిన్న చిన్న జంతువులకూ భయపడి పారిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ సింహం గేదెలను చూసి పరుగందుకుంది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలోని (South Africa) గ్రేటర్ క్రుగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆహార వేటలో భాగంగా జంతువుల కోసం ఎదురు చూస్తున్న సింహానికి ఉన్నట్టుండి గేదెల మంద కనిపిస్తుంది. ఒకటో రెండో అనుకుంటే ఏకంగా పదుల సంఖ్యలో గెదెలు వచ్చేశాయి. దీంతో సింహానికి ఒక్కసారిగా గుండె గుభేల్‌మంది. వెంటనే అక్కడి నుంచి పరుగందుకుంది.

Viral Video: గుండె దడ పుట్టించే సీన్.. కొండ అంచున్న బైక్ రైడ్.. చూస్తుండగానే..


అయినా గేదెలు మాత్రం సింహాన్ని (buffaloes chasing lion) వదలకుండా వెంటపడ్డాయి. ఎన్నాళ్ల నుంచి మనుసులో పెట్టుకున్నాయో ఏమో గానీ.. పరుగులు పెట్టినా సింహాన్ని వదలకుండా వెంటపడ్డాయి. దీంతో చివరకు సింహం ఓ చెట్టు పైకి ఎక్కింది. అప్పటికీ వదలని గేదెలు.. ఆ చెట్టు కిందనే నిలబడ్డాయి. అంతటితో ఆగకుండా సింహం కిందకు వచ్చేలా కొమ్మను కొమ్ములతో ఢీకొట్టాయి. దీంతో సింహం ఉన్న కొమ్మ ఒక్కసారిగా కూలిపడిపోయింది. దీంతో సింహం ధబేల్‌మని కిందపడింది. విరిగిన కొమ్మ దున్నపోతుపై పడడంతో అవి తికమకపడ్డాయి.

Viral Video: వేట కోసం చెట్టుపై సింహం, చిరుత భీకర పోరు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


ఈ క్రమంలో సింహం అక్కడి నుంచి జంప్ అయింది. ఇలా మొత్తానికి ఎలాగోలా గేదెల మంద నుంచి బయటపడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తోక ముడిచిన సింహం’’.. అంటూ కొందరు, ‘‘మొత్తానికి చుక్కలు చూపించాయిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: యువతికి షాకింగ్ లవ్ ప్రపోజల్.. చివరికి ఆమెను ఎలా ఒప్పించాడో చూస్తే..

Updated Date - Jul 20 , 2024 | 10:18 PM