Share News

Viral Video: సింహాలను మేతకు తోలుకెళ్లిన వ్యక్తి.. చివరకు అక్కడ జరిగింది చూసి ఖంగుతిన్న జనం..

ABN , Publish Date - Jul 19 , 2024 | 04:09 PM

పులులు, సింహాలను చూస్తే కొందరు భయంతో గజాగజా వణికిపోతే.. మరికొందరు వాటితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. ఇంకొందరైతే.. ఏకంగా వాటిని కూడా కంట్రోల్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి..

Viral Video: సింహాలను మేతకు తోలుకెళ్లిన వ్యక్తి.. చివరకు అక్కడ జరిగింది చూసి ఖంగుతిన్న జనం..

పులులు, సింహాలను చూస్తే కొందరు భయంతో గజాగజా వణికిపోతే.. మరికొందరు వాటితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. ఇంకొందరైతే.. ఏకంగా వాటిని కూడా కంట్రోల్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సింహాలను మేకల తరహాలో మేతకు తోలుకెళ్లాడు. అయితే చివరకు అక్కడి సీన్ చూసి అంతా ఖంగుతిన్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలో (South Africa) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సింహాలను కుక్కలు, మేకల తరహాలో మేతకు తోలుకెళ్లాడు. సింహాలు కూడా కుక్కలు, మేకలు, గొర్రెల్లాగానే అతడి వెంటే వెళ్లాయి. మధ్యలో మధ్యలో అతను చేతిలోని కర్రతో సింహాలను కంట్రోల్ చేస్తున్నాడు. కర్రను టచ్ చేయగానే సింహాలు కూడా భయంతో అతడు చెప్పినట్లే వింటున్నాయి.

Viral: భార్య నిర్లక్ష్యం చేస్తుండడంతో అనుమానం వచ్చిన భర్త.. పాడుబడ్డ ఇంట్లోకి డ్రోన్ కెమెరా పంపగా..


ఇలా ఆ సింహాలను ఓ చెరువు వద్దకు తోలుకెళ్లిన అతను.. ఆ తర్వాత తన వెంట బ్యాగులో తెచ్చుకున్న చిన్న చిన్న మాంసం ముక్కలను (man threw meat pieces to the lions) దూరంగా విసిరేశాడు. ఆ ముక్కలను ఇలా విసిరేయగానే.. సింహాలు వాటి కోసం పరుగులు పెట్టాయి. క్షణాల్లో అతడు విసిరేసిన ముక్కలను నోట కరుచుకున్నాయి. ఈ క్రమంలో మిగతా సింహాలు మాంసం ముక్కల కోసం అతడి వద్దకు ఎగబడతాయి. అయినా అతను ఎంతో కూల్‌గా వాటిని కర్రతో కంట్రోల్ చేస్తూ ఒకదాని తర్వాత ఒకటిగా మాంసం ముక్కలను విసిరేశాడు.

Viral Video: మొసళ్ల సరస్సులోకి బైక్‌తో దూసుకెళ్లిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


ఇతడు సింహాలను కంట్రోల్ చేసిన విధానం చూసి అక్కడున్న పర్యాటకులంతా షాక్ అయ్యారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహాలను కుక్కల్లా మార్చేశాడే’’.. అంటూ కొందరు, ‘‘ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 81 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వర్షంలో రీల్ చేయాలని ఉత్సాహంగా వెళ్లాడు.. కెమెరా ఆన్ చేసి డాన్స్ చేస్తుండగా..

Updated Date - Jul 19 , 2024 | 04:09 PM