Share News

Viral Video: పందిపై పులి దాడి.. మధ్యలో ఎంటరైన భారీ మొసలి.. చివరకు..

ABN , Publish Date - Jul 18 , 2024 | 07:32 PM

ఆహార వేటలో జంతువుల మధ్య కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పులులు, సింహాలు వంటి బలమైన జంతువులు మిగతా జంతువులపై ఆధిపత్యం చెలాయిస్తుంటాయి. ఈ క్రమంలో వాటికి..

Viral Video: పందిపై పులి దాడి.. మధ్యలో ఎంటరైన భారీ మొసలి.. చివరకు..

ఆహార వేటలో జంతువుల మధ్య కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పులులు, సింహాలు వంటి బలమైన జంతువులు మిగతా జంతువులపై ఆధిపత్యం చెలాయిస్తుంటాయి. ఈ క్రమంలో వాటికి కొన్నిసార్లు ఏనుగులు, మొసళ్లు, నీటి గుర్రాలు పోటీ ఇస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అడవి పందిపై ఓ పులి దాడి చేసింది. అయితే అదే సమయంలో ఓ భారీ మొసలి కూడా అక్కడికి వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. . రాజస్థాన్‌లోని (Rajasthan) రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద పులి ఆహారం కోసం వెతుకుతుండగా.. దానికి అనుకోకుండా అడవి పంది కనిపిస్తుంది. ఇంకేముందీ.. ఆ పూట నా ఆకలి తీరిపోయిట్లే.. అని అనుకుని, (Tiger attack on pig) దానిపై దాడికి దిగుతుంది. అనుకున్నట్లుగానే పందిని చాకచక్యంగా పట్టుకుంటుంది.

Viral Video: నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తి.. అంతా వేడుక చూస్తుండగా.. చివరకు ఎవరూ ఊహించని విధంగా..


పులి నుంచి తప్పించుకునేందుకు పంది విశ్వప్రయత్నాలు చేస్తుంటుంది. అయినా పులి మాత్రం దాని వదలకుండా మెడ గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఈ క్రమంలో ఆకలితో ఉన్న ఓ భారీ మొసలి (crocodile) అటుగా వస్తుంది. పులి పందిపై దాడి చేయడం చూసి, తన ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. పనిలో పనిగా తాను కూడా పందిని లాక్కెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకోసం పులికి సమీపానికి వెళ్లి నోరు తెరచి భయపెడుతుంది.

Viral Video: సర్కస్‌లో షాకింగ్ సీన్.. విన్యాసాలు చేస్తుండగా.. ఈ ఎలుగు బంటి ఏం చేసిందంటే..


అయినా పులి మాత్రం కొంచెం కూడా భయపడకుండా.. పందిని మరో చోటికి లాక్కెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంది. ఇలా ఎంత సేపు ఎదురుచూసినా మొసలికి ఆహారం మాత్రం దక్కదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మొసలి ఆశలు అడియాశలయ్యాయి’’.. అంటూ కొందరు, ‘‘మొసలిని లెక్కచేయని పులి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వర్షంలో రీల్ చేయాలని ఉత్సాహంగా వెళ్లాడు.. కెమెరా ఆన్ చేసి డాన్స్ చేస్తుండగా..

Updated Date - Jul 18 , 2024 | 07:32 PM