Share News

Viral Video: జలపాతం వద్ద రహస్యంగా పర్యాటకుల స్నానం.. సైలెంట్‌గా సమీపానికి వెళ్లిన పోలీసులు.. చివరకు..

ABN , Publish Date - Jul 16 , 2024 | 08:39 PM

చాలా మంది యువత నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం చూస్తుంటాం. కొందరు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలో పడేస్తుంటారు. అలాగే ...

Viral Video: జలపాతం వద్ద రహస్యంగా పర్యాటకుల స్నానం.. సైలెంట్‌గా సమీపానికి వెళ్లిన పోలీసులు.. చివరకు..

చాలా మంది యువత నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం చూస్తుంటాం. కొందరు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలో పడేస్తుంటారు. అలాగే మరికొందరు పర్యాటకులు కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్లిన సమయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొందరు నిబంధనలు అతిక్రమించి జలపాతం వద్ద రహస్యంగా స్నానం చేస్తుండగా.. పోలీసులు సైలెంట్‌గా అక్కడికి వెళ్లి షాక్ ఇచ్చారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కర్ణాటకలోని (Karnataka) ముదిగెరెలోని చార్మాడి జలపాతం (waterfall) వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రదేశంలో పర్యాటకులు స్నానం చేయడాన్ని నిషేధించారు. అయినా చాలా మంది పర్యాటకులు నిబంధనలు ఉల్లంఘించి (tourists Bathing) స్నానాలు చేస్తుంటారు. దీంతో ఆ ప్రదేశంలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయినా కొందరు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా అక్కడే స్నానాలు చేస్తుంటారు.

Viral Video: వరుడి స్నేహితులు ఇచ్చిన బహుమతిని తెరచిన వధువు.. లోపలి వస్తువును చూసి షాక్.. చివరకు ఛీ.. ఛీ.. అంటూ..


ఇదిలావుండగా, ఇటీవల చోటుచేసుకున్న ఓ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. జలపాతం వద్ద హెచ్చరిక బోర్డులను చూసి కూడా కొందరు పర్యాటకులు అక్కడ స్నానం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఓ కానిస్టేబుల్ సైలెంట్‌గా వారి సమీపానికి వెళ్లి.. అక్కడ ఉన్న పర్యాటకుల దుస్తులను ఎత్తుకెళ్లారు. వాటిని తీసుకెళ్లి పోలీసు వాహనంలో పడేశారు.

Viral Video: పదే పదే హారన్ కొడుతున్నా.. పట్టాల నుంచి తప్పుకోని వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే..


పోలీసులు చేసిన పనికి అక్కడ స్నానం చేస్తున్న పర్యాటకులు షాక్ అయ్యారు. అర్ధనగ్నంగానే పోలీసు వాహనం వద్దకు వెళ్లి.. తమ దుస్తులు తిరిగి ఇవ్వాలంటూ వేడుకున్నారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అన్ని ప్రాంతాల్లో ఇలాగే చేయాలి’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేస్తేనే నిబంధనలు పాటిస్తారు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇంతకీ ఆ దుస్తులను తిరిగి ఇచ్చారా లేదా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రోడ్డు పక్కన ప్రేమికుల రొమాన్స్.. కారులో వెళ్తూ కూతురిని చూసిన తండ్రి.. చివరకు..

Updated Date - Jul 16 , 2024 | 08:39 PM