Share News

Viral Video: వరుడి స్నేహితులు ఇచ్చిన బహుమతిని తెరచిన వధువు.. లోపలి వస్తువును చూసి షాక్.. చివరకు ఛీ.. ఛీ.. అంటూ..

ABN , Publish Date - Jul 16 , 2024 | 07:45 PM

ఒకప్పటి వివాహాలతో పోలిస్తే.. ప్రస్తుతం జరుగుతున్న వివాహాల్లో చాలా మార్పులు వచ్చాయి. వీటికి ప్రస్తుత సోషల్ మీడియా కూడా తోడవడంతో అవి కాస్త కొన్నిసార్లు హద్దులు దాటిపోవడం కూడా చూస్తున్నాం. ఇలాంటి...

Viral Video: వరుడి స్నేహితులు ఇచ్చిన బహుమతిని తెరచిన వధువు.. లోపలి వస్తువును చూసి షాక్.. చివరకు ఛీ.. ఛీ.. అంటూ..

ఒకప్పటి వివాహాలతో పోలిస్తే.. ప్రస్తుతం జరుగుతున్న వివాహాల్లో చాలా మార్పులు వచ్చాయి. వీటికి ప్రస్తుత సోషల్ మీడియా కూడా తోడవడంతో అవి కాస్త కొన్నిసార్లు హద్దులు దాటిపోవడం కూడా చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు కొన్నిసార్లు కోపం తెప్పిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. వధూవరులకు వారి స్నేహితులు వింత వింత బహుమతులు ఇవ్వడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వరుడి స్నేహితులు ఇచ్చిన బహుమతిని చూసి వధువు షాక్ అయింది. చివరకు ఏం చేసిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వధూవరులు (bride and groom) వేదికపై సోఫాలో కూర్చుని ఉంటారు. ఆ సమయంలో చాలా మంది వారికి బహుమతులు అందిస్తూ ఫొటోలు దిగుతుంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది. వరుడి స్నేహితులంతా కలిసి వధువును ఆటపట్టించాలని అనుకుంటారు.

Viral Video: పదే పదే హారన్ కొడుతున్నా.. పట్టాల నుంచి తప్పుకోని వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే..


ఇందుకోసం వారు ఓ వస్తువును అందంగా ప్యాక్ చేసి వేదిక పైకి వెళ్లి ఆమెకు అందిస్తారు. గిఫ్ట్ తీసుకున్న వధువు అందులో ఏముందో చూసేందుకు ఆసక్తిగా దాన్ని తెరిచేందుకు ప్రయత్నిస్తుంది. అయితే పైన ఉన్న కవర్ తీసి చూడగా.. లోపల (Baby milk bottle) చిన్న పిల్లల పాల బాటిల్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే ఆమె కోపంతో.. ఛీ ఛీ.. అంటూ దాన్ని పక్కన పడేస్తుంది. దీంతో అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకుంటారు. కింద పడిన పాల సీసా డబ్బాను కొందరు చేతిలోకి తీసుకుని, మళ్లీ వధువుకు అందిస్తారు.

Viral Video: ఇలాంటి డ్రైవర్లు ఉంటే ప్రమాదాలే జరగవేమో.. కారును ఎలా రివర్స్ చేస్తున్నాడో చూస్తే అవాక్కవడం ఖాయం..


అయితే అప్పటికే ఆగ్రహంగా ఉన్న వధువును చూసి.. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో ఏమో గానీ.. ఆ బాటిల్‌ను మళ్లీ వెనక్కు తీసుకుంటారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి బహుమతులు ఇవ్వాలో తెలుసుకోండి’’.. అంటూ కొందరు, ‘‘ఈ బహుమతి ఇచ్చిన వారికి కనీస జ్ఞానం కూడా లేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రోడ్డు పక్కన ప్రేమికుల రొమాన్స్.. కారులో వెళ్తూ కూతురిని చూసిన తండ్రి.. చివరకు..

Updated Date - Jul 16 , 2024 | 08:16 PM