Share News

Viral Video: పదే పదే హారన్ కొడుతున్నా.. పట్టాల నుంచి తప్పుకోని వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jul 16 , 2024 | 03:46 PM

కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైలు పట్లాలపై చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తుంటాం. మరికొందరు రైలు ఇంజిన్ల ముందు సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ ప్రమాదానికి గురైన సందర్భాలను కూడా చూశాం. అయినా ఇప్పటికీ..

Viral Video: పదే పదే హారన్ కొడుతున్నా..  పట్టాల నుంచి తప్పుకోని వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే..

కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైలు పట్లాలపై చిత్రవిచిత్ర విన్యాసాలు చేయడం చూస్తుంటాం. మరికొందరు రైలు ఇంజిన్ల ముందు సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ ప్రమాదానికి గురైన సందర్భాలను కూడా చూశాం. అయినా ఇప్పటికీ చాలా మందిలో మార్పు రావడం లేదు. ఇలాంటి ఆకతాయిలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఓ రైలు అటుగా వచ్చింది. అయితే అతన్ని చూసి ఎంత హారన్ మోగించినా ఆ వ్యక్తి మాత్రం రైలు పట్టాలపై నుంచి పక్కకు తప్పుకోలేదు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలీదు గానీ సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు రైల్వే ట్రాక్స్ మధ్యలో (young man walking on railway tracks) నడుచుంటూ వెళ్తుంటాడు. అదే సమయంలో ఓ రైలు రివర్స్‌లో అటుగా వస్తుంది. యువకుడిని చూడగానే రైలు డ్రైవర్ హారన్ (Train horn) కొట్టాడు. అయితే ఎంత సేపు హారన్ కొడుతున్నా అతడు మాత్రం స్పందించలేదు. తనకేమీ వినపడనట్లుగా పట్టాల మధ్యలో అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాడు.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. నాగుపామును ఒట్టి చేతులతో ఎలా పట్టాడో చూస్తే..


రైలు సమీపానికి వస్తున్నా అతడిలో ఏమాత్రం భయం కనిపించలేదు. ఈ క్రమంలో రైలుపై ఉన్న సిబ్బంది గట్టిగా కేకలు వేస్తూ అతడిని హెచ్చరిస్తారు. అయినా ఆ యువకుడు మాత్రం పట్టాలపై అలాగే నడుచుకుంటూ వెళ్తుంటాడు. దీంతో చివరికి రైలుపై ఉన్న వారికి కోపం కట్టలు తెంచుకుంటుంది. రైలుపై ఉన్న వారిలో ఓ వ్యక్తి కిందకు దిగి పరుగెత్తుకుంటూ అతడి వద్దకు వెళ్తాడు. వెళ్లీ వెళ్లగానే ఓ కర్ర తీసుకుని అతడిని వీపుపై గట్టిగా కొడతాడు.

Viral Video: ఎవరి మూడ్ ఎలా ఉంటుందో తెలీదంటే ఇదేనేమో.. వెనుకే వెళ్లి చెవి దగ్గర హారన్ కొట్టగా.. చివరకు..


దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాకై.. పట్టాల పైనుంచి పక్కకు పరుగులు పెడతాడు. అతను అక్కడి నుంచి దూరంగా వెళ్లే వరకూ రైల్వే సిబ్బంది అతడిని కొడుతూ వెంటపడతాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి వారికి ఇలాగే బుద్ధి చెప్పాలి’’.. అంటూ కొందరు, ‘‘సందేశం ఇచ్చేందుకు ఇదంతా కావాలని చేసినట్లు ఉంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నట్టు, బోల్టును ఇలాక్కూడా వాడొచ్చా.. తలుపులతో ఇతడు చేసిన ప్రయోగం చూడండి..

Updated Date - Jul 16 , 2024 | 04:04 PM